IPL : అంద‌రు ప్లేయ‌ర్ల‌ను మ‌ళ్లీ కొన్న చెన్నై.. రైనాను త‌ప్ప‌.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం..!

February 14, 2022 10:35 AM

IPL : బెంగ‌ళూరులో గ‌త రెండు రోజులుగా కొన‌సాగిన ఐపీఎల్ 2022 మెగావేలం ఎట్ట‌కేల‌కు ముగిసింది. ఈ క్ర‌మంలోనే ఫ్రాంచైజీలు అన్నీ పోటీలు ప‌డి మ‌రీ ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేశాయి. వచ్చే సీజ‌న్‌లో త‌మ స‌త్తా చాటేందుకు ప్లేయ‌ర్ల‌ను సిద్ధం చేసుకున్నాయి. ఇక ఈసారి చెన్నై టీమ్ అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ఆ జ‌ట్టులోని కీల‌క ఆట‌గాడైన సురేష్ రైనాను టీమ్ మ‌ళ్లీ కొనుగోలు చేయ‌లేదు. దీంతో చెన్నై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాము చిన్న త‌ల‌గా పిలుచుకునే సురేష్ రైనాను చెన్నై టీమ్ కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతో వారు మండిప‌డుతున్నారు.

IPL Chennai Super Kings did not buy Suresh Raina fans are angry
IPL

చెన్నై టీమ్ ఈసారి ర‌వీంద్ర జ‌డేజా, ధోనీ, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌ల‌ను రిటెయిన్ చేసుకుంది. దీంతో మిగిలిన ప్లేయ‌ర్లు అంద‌రూ వేలంలో నిలిచారు. వారిలో సురేష్ రైనా కూడా ఉన్నాడు. అయితే దీప‌క్ చాహ‌ర్‌, బ్రేవో, అంబ‌టి రాయుడు, ఎన్‌.జ‌గ‌దీశ‌న్‌, కేఎం ఆసిఫ్‌, మిచెల్ శాంట్‌న‌ర్ వంటి పాత ఆట‌గాళ్ల‌ను చెన్నై తిరిగి కొనుగోలు చేసి టీమ్‌లోకి తీసుకుంది. దీంతో మ‌ళ్లీ పాత ప్లేయ‌ర్లు అంద‌రూ టీమ్‌లోకి వ‌చ్చేశారు. అయితే సురేష్ రైనాను మాత్రం జ‌ట్టు యాజ‌మాన్యం కొనుగోలు చేయ‌లేదు. దీంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ తిన్నారు.

వాస్త‌వానికి 2020 ఐపీఎల్ సీజ‌న్‌లో దుబాయ్‌లో నిర్వ‌హించిన‌ప్పుడు సురేష్ రైనా టోర్నీ ఆరంభంలోనే వెనుదిరిగాడు. త‌న‌కు కుటుంబ స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, అందుక‌నే తాను టోర్నీ నుంచి త‌ప్పుకున్నాన‌ని రైనా అప్ప‌ట్లో వెల్ల‌డించాడు. కానీ కార‌ణం అది కాద‌ని.. అత‌నికి హోటల్ గ‌ది న‌చ్చ‌కే టోర్నీ నుంచి త‌ప్పుకుని వెళ్లిపోయాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. వాటిని జ‌ట్టు యాజ‌మాన్యం, రైనా ఖండించ‌లేదు. అయితే అది ముగిసిన అధ్యాయం. గ‌తేడాది మ‌ళ్లీ చెన్నై టీమ్‌లో ఆడిన రైనా రెచ్చిపోయాడు. ఈ క్ర‌మంలోనే చెన్నై మ‌ళ్లీ ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది.

ఇక గ‌తంలోనూ అనేక మ్యాచ్‌ల‌లో చెన్నై త‌ర‌ఫున ఆడిన రైనా జ‌ట్టుకు అనేక సార్లు కీల‌క విజ‌యాల‌ను అందించాడు. అయితే రైనా చేసిన సేవ‌ల‌ను మ‌రిచిపోయిన చెన్నై యాజ‌మాన్యం కావాల‌నే అత‌న్ని జట్టులోకి తీసుకోలేద‌ని, ఇది త‌మ‌ను తీవ్రంగా క‌ల‌చివేస్తుంద‌ని, రైనాను తీసుకోనందుకు నిర‌స‌న‌గా చెన్నై జ‌ట్టుకు ఇక‌పై స‌పోర్ట్ చేయ‌బోమ‌ని.. ముంబైకి స‌పోర్ట్ అందిస్తామ‌ని.. ఫ్యాన్స్ బ‌హిరంగంగానే సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ఈ విష‌యంలో చెన్నై ఏం చేస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now