Posani Krishna Murali : పోసాని కృష్ణ‌ముర‌ళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఆ బతుకు నాకొద్దు.. అంటూ కామెంట్స్‌..!

February 13, 2022 2:05 PM

Posani Krishna Murali : న‌టుడు, ర‌చ‌యిత‌, వైసీపీ నేత పోసాని కృష్ణ‌ముర‌ళి ఎల్ల‌ప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఆయ‌న ఎప్పుడూ ఏవో ఒక కామెంట్స్ చేస్తుంటారు. దీంతో ఆయ‌న వివాదాల్లో నిలుస్తుంటారు. అప్ప‌ట్లో ప‌వ‌న్ ఏపీ ప్ర‌భుత్వం, మంత్రుల‌పై చేసిన కామెంట్ల‌కు పోసాని స్పందించారు. దీంతో కొంద‌రు వ్య‌క్తులు పోసాని ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ఆ త‌రువాత ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది. అయితే తాజాగా మ‌ళ్లీ ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

Posani Krishna Murali sensational comments on paruchuri brothers
Posani Krishna Murali

ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ బాబు న‌టించిన స‌న్ ఆఫ్ ఇండియా మూవీ నెల 18వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన పోసాని కృష్ణ‌ముర‌ళి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

తాను పరుచూరి బ్రదర్స్ దగ్గర సుమారుగా 5 ఏళ్ల పాటు ప‌నిచేశాన‌ని పోసాని తెలిపారు. ఆ స‌మ‌యంలోనే త‌న‌కు మోహ‌న్ బాబుతో ప‌రిచ‌యం అయింద‌ని అన్నారు. అయితే ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ నుంచి తాను చాలా నేర్చుకున్నాన‌ని.. కానీ వారిలా మాత్రం బ‌త‌కాల‌ని కోరుకోవ‌డం లేద‌ని అన్నారు. వాళ్ల‌కు అస‌లు బ‌త‌క‌డం అంటే ఏమిటో తెలియ‌ద‌ని, అలాంటి వాళ్ల‌ను ఇండ‌స్ట్రీ ఎందుకు ప‌క్క‌న పెట్టిందో త‌న‌కు తెలుస‌ని అన్నారు.

అలాగే పరుచూరి, ఆత్రేయ, వేటూరి లాంటి వాళ్ళని చూసి ఈ బతుకు నాకు వద్దు అని అనుకున్నానని తెలిపారు. క‌నీసం చ‌నిపోయిన స‌మ‌యంలోనూ ప‌ట్టుమ‌ని ప‌ది రాని ఇండ‌స్ట్రీ గురించి త‌న‌కు బాగా తెలుస‌ని, త‌న‌ను ఇండ‌స్ట్రీ నిషేధించినా ఫ‌ర్వాలేదు, త‌న సంతానం, వారి సంతానం బ‌తికేంత‌గా సంపాదించాన‌ని తెలిపారు. కొంద‌రికి మందు పోసి చికెన్ అందించే బ‌తుకు త‌న‌కొద్దు అని పోసాని అన్నారు. అయితే ప్ర‌స్తుతం ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంలో చిరంజీవి జ‌గ‌న్‌ను క‌లిసిన అంశంపై ఆయ‌న‌కు, మోహ‌న్‌బాబుకు మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ ద‌శ‌లో పోసాని చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now