Deepika Padukone : ఎన్‌టీఆర్‌, అల్లు అర్జున్‌ల‌తో న‌టించాల‌ని ఉంది.. మ‌న‌సులో మాట చెప్పిన దీపికా ప‌దుకొనె..

February 10, 2022 9:19 PM

Deepika Padukone : బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనె ప‌లు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఆమె న‌టించిన గెహ్రాయియా మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో అన‌న్య పాండే మ‌రో క‌థానాయిక‌గా న‌టించింది. ఇక ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా దీపికా ప‌దుకొనె త‌న మ‌న‌సులో మాట చెప్పింది. తెలుగులో ఏ హీరోల‌తో యాక్ట్ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తారు.. అని అడ‌గ్గా.. అందుకు దీపికా స‌మాధానం చెప్పింది.

Deepika Padukone wants to act with NTR and Allu Arjun
Deepika Padukone

ఎన్‌టీఆర్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని, ఆయ‌న‌తో క‌ల‌సి న‌టించాల‌ని ఉంద‌ని దీపికా ప‌దుకొనె తెలియ‌జేసింది. ఆయ‌న న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఫుటేజ్ చూశాన‌ని.. అద్భుతంగా యాక్ట్ చేశార‌ని, అలాంటి నటుడితో న‌టించాల‌ని ఎవ‌రికైనా ఉంటుంద‌ని పేర్కొంది.

ఇక ఎన్‌టీఆర్ యాక్టింగ్ స్టైల్‌కు తాను ఫిదా అయ్యాన‌ని దీపికా తెలియ‌జేసింది. అలాగే అల్లు అర్జున్ అంటే ఇష్ట‌మ‌ని కూడా చెప్పింది. పుష్ప సినిమాలో ఆయ‌న యాక్టింగ్ అద్భుతంగా ఉంద‌ని కితాబిచ్చింది. ఈ క్ర‌మంలోనే తాను ఎన్‌టీఆర్‌, అల్లు అర్జున్‌ల‌తో న‌టించాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపింది. ఇక దీపికా ప్ర‌స్తుతం తెలుగులో ప్ర‌భాస్ తో క‌లిసి ప్రాజెక్ట్ కె అనే మూవీలో న‌టిస్తుండ‌గా.. ప్ర‌భాస్ గురించి కూడా ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలిపింది.

ప్ర‌భాస్ ఒక ట్రూ జెంటిల్మ‌న్ అని, ఆయ‌న అంద‌రితోనూ ఎంతో స్నేహంగా ఉంటార‌ని చెప్పింది. ఆయ‌న ప్ర‌తి ఒక్క‌రినీ ఎంతో ప్ర‌త్యేకంగా చూసుకుంటార‌ని స్ప‌ష్టం చేసింది. ఆయ‌న మ‌ర్యాద‌ల‌కు తాను ప‌డిపోయాన‌ని, ఆయ‌న అతిథులుకు పెట్టే ఫుడ్ చాలా బాగుంటుంద‌ని, అందుకు తానే ఫిదా అయ్యాన‌ని.. దీపికా ప‌దుకొనె తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now