Shruti Haasan : శృతి హాస‌న్‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌శ్న అడిగిన నెటిజ‌న్‌.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన బ్యూటీ..!

February 10, 2022 8:33 AM

Shruti Haasan : శృతి హాస‌న్ ఈ మ‌ధ్య కాలంలో ప‌లు వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ ఎంతో బిజీగా ఉంటోంది. తెలుగులోనూ ఈమె ప‌లు చిత్రాల్లో న‌టిస్తోంది. ఇక తాజాగా ఈమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లైవ్ చాట్ సెష‌న్ నిర్వ‌హించింది. అందులో త‌న ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు చెప్పింది. అయితే ఒక నెటిజ‌న్ మాత్రం ఆమెను ఇబ్బంది పెట్టే ప్ర‌శ్న అడిగాడు.

fan asked Shruti Haasan a question about Hindi she has given strong reply
Shruti Haasan

త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ వంటి రాష్ట్రాల్లో వారికి మాతృభాషపై మ‌మ‌కారం ఎక్కువ‌. హిందీని ఏమాత్రం స‌హించరు. గ‌తంలో త‌మ భాష‌ను కించ ప‌రిచిన వారిపై వారు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఆయా రాష్ట్రాల్లో త‌ర‌చూ జ‌రుగుతూనే ఉంటాయి. హిందీ అంటే వారికి అస‌లు ప‌డ‌దు. అయితే ఓ నెటిజ‌న్ శృతి హాస‌న్‌ను దీనిపైనే ప్ర‌శ్న అడిగాడు. మీరు హిందీ మూవీల్లో కూడా న‌టించారు క‌దా, మీకు హిందీ మాట్లాడ‌డం వ‌చ్చా.. అని అడిగాడు.

ఇక అందుకు శృతి హాస‌న్ బ‌దులిస్తూ.. ఇది 2022, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మ‌నుషులంద‌రూ ఒక్క‌టే. ప‌క్ష‌పాతం చూపించ‌డం ఎందుకు, మ‌న భూగ్ర‌హం ఏమైనా ప్ర‌త్యేక‌మా.. అంద‌రం సినిమాలు తీస్తున్నాం, క‌ష్ట‌ప‌డుతున్నాం, ప‌క్ష‌పాతం చూపించ‌డం త‌గ‌దు.. అని శృతి హాస‌న్ రిప్లై ఇచ్చింది.

శృతి హాస‌న్ గతంలో ల‌క్‌, తెవార్‌, దిల్ తో బ‌చా హై జీ, డి డే, వెల్‌క‌మ్ బ్యాక్‌, రాకీ హ్యాండ్‌స‌మ్‌, బెహెన్ హోగీ తేరీ వంటి చిత్రాల్లో న‌టించింది. అయితే ఆమెకు అక్క‌డ అంత‌గా గుర్తింపు రాలేదు. కానీ తెలుగు సినిమాల‌తో ఆమె ద‌శ తిరిగిపోయింది. ఇక ప్ర‌స్తుతం శృతి హాస‌న్ తెలుగులో ప్ర‌భాస్ ప‌క్క‌న స‌లార్ మూవీలో న‌టిస్తోంది. ఈ మూవీని ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ మూవీని విడుద‌ల చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now