Bhimla Nayak : వివాదంలో చిక్కుకున్న భీమ్లా నాయ‌క్‌..!

February 9, 2022 8:26 PM

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. వ‌కీల్ సాబ్ అనంత‌రం ఆయ‌న చేస్తున్న సినిమా ఇది. దీంతో అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ మూవీ సంక్రాంతికే విడుద‌ల కావ‌ల్సి ఉన్నా.. ఆర్ఆర్ఆర్ కార‌ణంగా వాయిదా వేశారు. దీంతో ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భీమ్లా నాయ‌క్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది.

Bhimla Nayak movie got in controversy
Bhimla Nayak

భీమ్లానాయ‌క్‌కు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న విషయం విదిత‌మే. మ‌ళ‌యాళంలో రూపొందిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా భీమ్లా నాయ‌క్‌ను తెర‌కెక్కించారు. అయితే ఒరిజిన‌ల్ మూవీకి జేక్స్ బెజాయ్ సంగీతం అందించారు. ఈ క్ర‌మంలోనే ఒరిజిన‌ల్ సినిమాలోని కొన్ని ట్యూన్స్‌ను భీమ్లా నాయ‌క్‌లోనూ య‌థావిధిగా వాడుకున్నారు. కానీ త‌న మ్యూజిక్‌కు థ‌మ‌న్ క్రెడిట్స్ ఇవ్వ‌లేద‌ని జేక్స్ ఆరోపించారు. ఈ విష‌యంపై తాను ఇండియ‌న్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ (ఐపీఆర్ఎస్‌)కు వెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు.

అయితే దీనిపై థ‌మ‌న్ గానీ, అటు భీమ్లా నాయ‌క్ మేక‌ర్స్ గానీ స్పందించాల్సి ఉంది. గ‌తంలో ఇలా అనేక చిత్రాలు ప‌లు వివాదాల్లో చిక్కుకున్నాయి. కానీ మేక‌ర్స్ అలాంటి వివాదాల‌ను లేకుండా చేశారు. బాధితుల‌తో క‌లిసి చ‌ర్చించి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకున్నారు. క‌నుక భీమ్లా నాయ‌క్‌కు కూడా అలాగే జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు. ఇక జేక్స్ తెలుగులోనూ ప‌లు సినిమా ఆఫ‌ర్లు ద‌క్కించుకున్నారు. జేక్స్ తాజాగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన గోపీచంద్ సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌కు సంగీతం అందించారు. అలాగే ప‌లు ఇత‌ర చిత్రాల‌కు కూడా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now