Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ తెలుగు.. తేజ‌స్వి మ‌డివాడ‌, ముమైత్ ఖాన్‌లు క‌న్‌ఫాం.. ర‌చ్చ ర‌చ్చే..!

February 8, 2022 4:53 PM

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు 5వ సీజ‌న్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందుక‌నే నిర్వాహ‌కులు బిగ్ బాస్ ఓటీటీని ప్లాన్ చేశారు. ఇక ఈ షో ఈ నెల 26వ తేదీ నుంచి ప్ర‌సారం కానుంది. ఓటీటీ అని పేరు పెట్టారు క‌నుక ఈ బిగ్ బాస్ ఓటీటీ షో కేవ‌లం ఓటీటీ యాప్‌లోనే ప్రసారం అవుతుంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్‌లో ఈ షో స్ట్రీమ్ అవుతుంది.

Bigg Boss OTT Telugu tejaswi madivada and mumaith khan confirmed
Bigg Boss OTT Telugu

ఇక బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షోకు గాను ఇప్ప‌టికే కంటెస్టెంట్ల‌ను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే వారు 10 రోజుల పాటు క్వారంటైన్‌లో గ‌డ‌ప‌నున్నారు. ఇక కంటెస్టెంట్ల‌లో ఇద్ద‌రి పేర్లు క‌న్‌ఫామ్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌రు తేజ‌స్వి మ‌డివాడ కాగా.. మ‌రొక‌రు ముమైత్ ఖాన్‌. దీంతో బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో ర‌చ్చ ర‌చ్చ‌గా ఉంటుంద‌ని ఊహించ‌వ‌చ్చు.

అయితే షోను 12 వారాల పాటు కొన‌సాగించాల‌ని అనుకున్నార‌ట‌. కానీ కేవ‌లం 6 వారాలు మాత్రమే కొన‌సాగుతుంద‌ని స‌మాచారం. ఇక ఈ షోను రోజుకు 24 గంట‌లూ లైవ్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. అందువ‌ల్ల ప్రేక్షకుల‌కు మ‌రింత వినోదం ల‌భిస్తుంద‌ని భావిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే తేజ‌స్వి మ‌డివాడ‌, ముమైత్ ఖాన్‌ల పేర్లు ఈ షోకు క‌న్‌ఫామ్ అయిన‌ట్లు తెలుస్తుండ‌గా.. వారు ఇది వ‌ర‌కే టీవీలో వ‌చ్చిన బిగ్ బాస్ సీజ‌న్‌ల‌లో పాల్గొన్నారు. దీంతో ఈసారి వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారు.. అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే ముమైత్ ఖాన్ బిగ్ బాస్ లో పాల్గొన్న‌ప్పుడు వివాదాలు ఎక్కువ‌గా న‌డిచాయి. షోలో అలాంటివి ఉంటేనే ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా చూస్తార‌ని బిగ్ బాస్‌కు అర్థ‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. అందుక‌నే ముమైత్‌ను ఈసారి ఆ అంశం కోస‌మే తీసుకున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఆమె ఈసారి షోలో ఎంత‌టి ర‌చ్చ చేస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now