Kalyan Dhev : ఈసారి శ్రీ‌జ భర్త క‌ల్యాణ్ దేవ్ వంతు.. స‌ముద్ర‌పు అల‌ల ఫొటోను షేర్ చేసి కామెంట్‌..!

February 5, 2022 4:34 PM

Kalyan Dhev : మెగా స్టార్ చిరంజీవి కుమార్తె శ్రీ‌జ భ‌ర్త క‌ల్యాణ్ దేవ్ పేరు ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వార్త‌ల‌లో వినిపిస్తోంది. శ్రీ‌జ‌, క‌ల్యాణ్‌దేవ్‌లు కొంత కాలంగా దూరంగా ఉంటున్నార‌ని.. వీరు త్వ‌ర‌లో విడాకులు తీసుకోబోతున్నార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే ఇప్ప‌టికీ ఈ విష‌యంపై ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంటోంది. క‌ల్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీకి అందుక‌నే దూరంగా ఉంటున్నాడ‌ని కూడా అంటున్నారు.

Kalyan Dhev shared latest post viral in social media
Kalyan Dhev

ఇటీవ‌లి కాలంలో మెగా ఫ్యామిలీ మొత్తం ప‌లు సంద‌ర్భాల్లో క‌ల‌సి వేడుక‌లు జ‌రుపుకున్నారు. కానీ వాటిల్లో ఎక్క‌డా క‌ల్యాణ్ దేవ్ క‌నిపించ‌లేదు. దీంతో క‌ల్యాణ్‌దేవ్‌, శ్రీ‌జ విడాకులు తీసుకుంటున్నార‌నే వార్త‌లకు బ‌లం చేకూరిన‌ట్ల‌యింది. ఇక ఈ మ‌ధ్యే శ్రీ‌జ కూడా ఓ ఎమోష‌నల్ పోస్ట్ షేర్ చేసింది. ముంబై వీధుల్లో త‌న అన్న రామ్ చ‌ర‌ణ్‌తో తిరిగిన ఆమె.. అలాంటి చిన్న చిన్న సంతోష‌మైన క్ష‌ణాల కోస‌మే తాను ఇంకా బ‌తికి ఉన్నాన‌ని కామెంట్ చేసింది. దీంతో ఆమె బాధ‌లో ఉండి ఎమోష‌న‌ల్‌గా ఆ పోస్టు పెట్టి ఉంటుంద‌ని అనుకున్నారు.

ఇక క‌ల్యాణ్ దేవ్ కూడా తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. స‌ముద్ర‌పు అల‌ల‌తో కూడిన ఫొటోను షేర్ చేసిన క‌ల్యాణ్ దేవ్‌.. చాలా సంతోషంగా.. హ్యాపీగా ఉన్నాన‌ని తెలిపాడు. అయితే అందులో అర్థం ఏమై ఉంటుందా.. అని నెటిజ‌న్లు ఆలోచిస్తున్నారు. శ్రీ‌జ‌కు అత‌ను విడాకులు ఇచ్చాడ‌ని.. అందుక‌నే అత‌ను సంతోషంగా ఉన్నాడ‌ని కొంద‌రు అంటున్నారు.

అయితే ఈ మ‌ధ్య కాలంలో శ్రీ‌జ ఎక్క‌డ తిరిగినా.. ఒంట‌రిగానే క‌నిపిస్తుంది కానీ ప‌క్క‌నే క‌ల్యాణ్ దేవ్ ఉండడం లేదు. ఇక అత‌ని సినిమాల‌ను కూడా మెగా ఫ్యామిలీ ఎక్క‌డా ప్ర‌మోట్ చేయ‌డం లేదు. దీంతో వీరిద్ద‌రూ విడాకులు తీసుకుంటున్నార‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూరుతోంది. మరి ముందు ముందు ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now