Sobhita Dhulipala : ఎద అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోయిన శోభిత ధూళిపాళ..!

February 5, 2022 8:11 AM

Sobhita Dhulipala : రమణ్‌ రాఘవ్‌ 2.0 అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన భామ.. శోభిత ధూళిపాళ. ఈమె పలు చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఈమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. కానీ వచ్చిన అవకాశాల్లో మాత్రం తన సత్తా చాటుతోంది. గ్లామర్‌ షోకు, ఎలాంటి రొమాంటిక్‌ సీన్స్‌లో అయినా నటించేందుకు ఈమె రెడీ అంటుంది. సోషల్‌ మీడియాలోనూ ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను అందులో షేర్‌ చేస్తూ అందాలను ఆరబోస్తుంటుంది.

Sobhita Dhulipala latest silver color dress photos viral
Sobhita Dhulipala

ఇక శోభిత ధూళిపాళ తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు కుర్రకారు మతులను పోగొడుతున్నాయి. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఈమె దిగిన ఫొటోలను చూస్తుంటే యువతకు అసలు నిద్ర పట్టడం లేదు. ఒక రేంజ్‌లో ఈమె అందాల ప్రదర్శన చేస్తోంది.

తెలుగులోనూ ఈమె పలు హిట్‌ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా అడివి శేష్‌తో కలిసి గూఢచారి సినిమాలో నటించి అలరించింది. అందులో వారిద్దరి మధ్య పలు రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్నాయి. ఇక ఈమె ప్రస్తుతం తమిళంలో పొన్నియిన్‌ సెల్వన్‌ అనే సినిమా చేస్తోంది. అలాగే హిందీలో చేసిన సితార అనే సినిమా పూర్తయి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. దీంతోపాటు అడివి శేష్‌ తాజా చిత్రం మేజర్‌లోనూ ఈమె నటించింది. ఈ మూవీ మే చివర్లో విడుదల కానుంది. అలాగే మంకీ మ్యాన్‌ అనే ఓ అమెరికన్‌ సినిమాలోనూ ఈ భామ నటించగా.. ఆ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now