Bigg Boss OTT Telugu : వామ్మో.. ఈ పాత కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఓటీటీలోన‌ట‌.. ఇక రచ్చ ర‌చ్చే..!

February 4, 2022 5:53 PM

Bigg Boss OTT Telugu : బుల్లితెర‌పై బిగ్ బాస్ షో ప్రారంభానికి మ‌ళ్లీ స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది. బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షోను ప్రారంభించేందుకు నిర్వాహ‌కులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షో ఈనెల 26వ తేదీన ప్రారంభం కానుంద‌ని తెలుస్తుండ‌గా.. షో కోసం నిర్వాహ‌కులు కంటెస్టెంట్ల‌ను వెదికే ప‌నిలో ప‌డ్డారు. అందులో భాగంగానే ప‌లువురు పాత కంటెస్టెంట్ల‌ను కూడా ఈ షోలో తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

Bigg Boss OTT Telugu these old contestants may participate
Bigg Boss OTT Telugu

బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి గాను ముమైత్ ఖాన్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, ప్రిన్స్‌ల‌ను తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. వీరు ఈ షోకు క‌న్‌ఫాం అయ్యార‌ని స‌మాచారం. గ‌త బిగ్ బాస్ సీజ‌న్ల‌లో వీరు పాల్గొని హౌస్‌లో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. దీంతో వీరు గ‌న‌క ఈ షోలో పాల్గొంటే మ‌ళ్లీ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అంటున్నారు. వీరు హౌస్‌లో మ‌ళ్లీ ర‌చ్చ చేస్తార‌ని భావిస్తున్నారు.

ఇక ఈ షోకు గాను నాగార్జున‌నే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. మొత్తం 12 వారాల పాటు.. అంటే.. 84 రోజుల పాటు ఈ షో ప్ర‌సారం అవుతుంది. అయితే బిగ్ బాస్ సాధార‌ణ టీవీ షో రోజుకు 1 గంట నుంచి 2 గంట‌ల వ‌ర‌కు ప్ర‌సారం అయ్యేది. కానీ బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో మాత్రం రోజుకు 24 గంట‌లూ లైవ్‌లో ప్ర‌సారం కానుంది. దీంతో ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సినంత వినోదం ల‌భ్యం కానుంది. మ‌రి ఈ షో ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now