Allu Arjun : జొమాటో యాడ్‌లో అల‌రించిన అల్లు అర్జున్‌.. భ‌లే క్రేజీగా ఉంది..!

February 4, 2022 3:46 PM

Allu Arjun : ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అల్లు అర్జున్ కు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. అందువ‌ల్లే అల్లు అర్జున్‌ను ప‌లు కంపెనీలు ఇప్ప‌టికే త‌మ బ్రాండ్ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా నియ‌మించుకున్నాయి. ప‌లు కంపెనీల‌కు చెందిన యాడ్స్‌లో అల్లు అర్జున్ ఇప్ప‌టికే న‌టించారు. అయితే తాజాగా ఆయన ఫుడ్ డెలివ‌రీ యాప్ జొమాటోకు చెందిన యాడ్‌లో క‌నిపించి అల‌రించారు.

Allu Arjun in Zomato ad it is very funny video
Allu Arjun

ఈ యాడ్‌లో అల్లు అర్జున్‌.. న‌టుడు సుబ్బ‌రాజ్ ఇచ్చే పంచ్ నుంచి త‌ప్పించుకుని అత‌నికి రివ‌ర్స్‌లో పంచ్ ఇస్తాడు. దీంతో సుబ్బ‌రాజ్ గాల్లోకి పైకి లేస్తాడు. అదే స‌మ‌యంలో గాల్లోనే సుబ్బ‌రాజ్ మాట్లాడుతూ.. బ‌న్నీ.. న‌న్ను త్వ‌ర‌గా కింద ప‌డేయ‌వా.. గోంగూర మ‌ట‌న్ తినాల‌ని ఉంది, కింద ప‌డే లోపు రెస్టారెంట్స్ అన్నీ మూత ప‌డిపోతాయ్‌.. అంటాడు.

అందుకు వెంట‌నే అల్లు అర్జ‌న్‌.. ఇప్పుడు చేతిలో జొమాటో ఉందిగా.. ఏం కావాల‌న్నా, ఎప్పుడు కావాల‌న్నా.. వెంట‌నే వ‌చ్చేస్తుంది, యాప్‌ను ఓపెన్ చేయ‌డ‌మే.. అంటాడు. త‌రువాతే త‌గ్గేదేలే.. అని పుష్ప సినిమాలో డైలాగ్‌ను చెప్పాడు. ఈ క్ర‌మంలోనే ఈ యాడ్ ఎంతో క్రేజీగా ఉండి ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ యాడ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక అల్లు అర్జున్ త్వ‌ర‌లోనే పుష్ప రెండో పార్ట్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now