Unstoppable Show : నా సినిమాల్లోని ఒక డైలాగ్ చెప్ప‌వా అని అడిగిన బాల‌య్య‌.. అందుకు మ‌హేష్ బాబు రియాక్ష‌న్‌.. అన్‌స్టాప‌బుల్ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వైర‌ల్‌..!

February 3, 2022 5:49 PM

Unstoppable Show : బుల్లితెర స్టార్ యాంక‌ర్ల‌కు దీటుగా నంద‌మూరి బాల‌కృష్ణ త‌న అన్‌స్టాప‌బుల్ షోను కొన‌సాగించారు. గ‌తంలో కొంద‌రు సినిమా స్టార్స్ ప‌లు షోల‌ను చేశారు. కానీ ఏ షోకూ రాని పేరు అన్‌స్టాప‌బుల్ షోకు వ‌చ్చింది. రేటింగ్స్ ప‌రంగా కూడా ఈ షో ఇర‌గ‌దీసింద‌నే చెప్పాలి. బాల‌కృష్ణ ఈ షోలో త‌న‌లో ఉన్న స‌ర‌దా యాంగిల్‌ను బ‌య‌ట‌కు తీశారు. ఎంతో మంది స్టార్స్‌తో స‌రదాగా షో నిర్వ‌హించారు. ఇక ఈ షో ముగింపున‌కు వ‌చ్చేసింది. అందులో భాగంగానే టాలీవుడ్ ప్రిన్స్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో బాల‌కృష్ణ చివ‌రి ఎపిసోడ్ చేశారు. ఆ ఎపిసోడ్ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 4) ప్ర‌సారం కానుంది. రాత్రి 8 గంట‌ల‌కు ఆ ఎపిసోడ్‌ను స్ట్రీమ్ చేయ‌నున్నారు.

Unstoppable Show mahesh babu episode promo viral
Unstoppable Show

కాగా మ‌హేష్ బాబుతో బాల‌కృష్ణ చేసిన అన్‌స్టాప‌బుల్ షో మొద‌టి సీజ‌న్ ఫైన‌ల్ ఎపిసోడ్ కోసం ఎంతో మంది ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. గ‌త వారం కింద‌ట ఓ ప్రోమోను ఆహా వారు లాంచ్ చేశారు. ఇక తాజాగా గురువారం మ‌ళ్లీ ఇంకో ప్రోమోను లాంచ్ చేశారు. ఈ ప్రోమో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అందులో భాగంగా ఎపిసోడ్‌లోని ప‌లు సీన్స్‌ను చూపించారు. వాటిల్లో మ‌హేష్ బాబు ఎంతో స‌ర‌దాగా న‌వ్వుతూ క‌నిపించారు.

ఎపిసోడ్‌లో భాగంగా బాల‌కృష్ణ.. మ‌హేష్‌ను ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు. నువ్వు ఇంత యంగ్‌గా ఉన్నావేంటి..? అని మ‌హేష్‌ను అడగ్గా.. అందుకు ఆయ‌న బిగ్గ‌ర‌గా న‌వ్వేశారు. ఇక నా సినిమాల‌లోని ఏదైనా ఒక డైలాగ్‌ను నువ్వు చెబితే వినాల‌ని ఉంది ? అని బాల‌య్య.. మ‌హేష్‌ను అడ‌గ్గా.. అందుకు మ‌హేష్ స్పందిస్తూ.. మీ సినిమాల్లోని డైలాగ్స్ ను మీరే చెప్ప‌గ‌ల‌రు, ఇంకెవ‌రితోనూ అది సాధ్యం కాద‌ని అన్నారు.

చిన్న‌త‌నంలో నువ్వు చాలా నాటీ అని విన్నాను, నిజ‌మేనా.. అని అడగ్గా.. అందుకు మ‌హేష్ న‌వ్వేశారు. వెకేష‌న్ కని వెళ్లావు, పెళ్లి చేసుకున్నావు, ఏంటి క‌థ‌.. అని అడ‌గ్గా.. అందుకు కూడా మ‌హేష్ న‌వ్వారు. ఇక 3 ఏళ్లు గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వ‌చ్చింది.. అన్న ప్ర‌శ్న‌కు మ‌హేష్ స్పందిస్తూ.. త‌న‌ను తాను క‌రెక్ట్ చేసుకునేందుకే అలా గ్యాప్ తీసుకున్నాన‌ని, ఆ త‌రువాత వెన‌క్కి తిరిగి చూసుకోలేద‌ని.. మ‌హేష్ అన్నారు. ఇందుకు బాల‌య్య‌.. అన్‌స్టాప‌బుల్ అన్న‌మాట‌.. అని రిప్లై ఇచ్చారు.

ఇలా బాల‌కృష్ణ‌, మ‌హేష్‌ల అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్ ఎంతో స‌ర‌దాగా, ఫ‌న్నీగా సాగింది. ఇక ఈ షో శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల‌కు స్ట్రీమ్ కానున్న నేప‌థ్యంలో అందులో మ‌హేష్‌ను బాల‌య్య ఇంకా ఎన్ని ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు అడిగారోన‌ని ఉత్కంఠ క‌లుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఫ్యాన్స్ ఆ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందా.. అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా విడుద‌లైన ఈ ఎపిసోడ్‌కు చెందిన ప్రోమో.. విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now