Whatsapp : బాబోయ్‌.. 20 ల‌క్ష‌ల యూజ‌ర్ల‌ను నిషేధించిన వాట్సాప్‌..!

February 3, 2022 1:46 PM

Whatsapp : నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించే వారిపై ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి నెలా అలాంటి ఎన్నో ల‌క్ష‌ల మంది యూజ‌ర్ల‌ను వాట్సాప్ నిషేధిస్తోంది. ఇక వాట్సాప్ విడుద‌ల చేసిన తాజా నివేదిక ప్ర‌కారం.. కేవ‌లం డిసెంబ‌ర్ నెల‌లోనే 20 ల‌క్ష‌ల వాట్సాప్ ఖాతాల‌ను నిషేధించిన‌ట్లు వెల్ల‌డైంది.

Whatsapp said that it banned over 20 lakh users in December 2021
Whatsapp

డిసెంబ‌ర్ నెల‌లో మొత్తం 528 ఫిర్యాదులు అందాయ‌ని.. ఆ మేర‌కు మొత్తం 20 ల‌క్ష‌ల ఖాతాల‌ను నిషేధించామ‌ని వాట్సాప్ తెలియ‌జేసింది. ఇక న‌వంబ‌ర్ నెల‌లో 17.5 ల‌క్ష‌ల ఖాతాల‌ను నిషేధించింది. స‌ద‌రు యూజ‌ర్లు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. యూజ‌ర్ల‌కు బ‌ల్క్ మెసేజ్‌ల‌ను పంపిస్తున్నార‌ని.. అందుక‌నే ఆ ఖాతాల‌ను నిషేధించ‌డం జ‌రిగింద‌ని వాట్సాప్ తెలియ‌జేసింది.

ఇక డిసెంబ‌ర్ నెల‌లో మొత్తం 528 ఫిర్యాదులు అంద‌గా.. వాటిలో 303 మంది నిషేధాన్ని ఎత్తివేయాల‌ని కోరిన‌ట్లు తెలిపింది. గ‌తేడాది మే నెల నుంచి వాట్సాప్ ఈ విధంగా చ‌ర్య‌లు తీసుకుంటోంది. దేశంలో చెలామ‌ణీలో ఉన్న సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నీ ఇలాంటి ఫిర్యాదుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో నెల నెలా నివేదిక‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆయా సంస్థ‌లు ఒక ప్ర‌త్యేక అధికారిని నియ‌మించుకోవాలి. వారు కేంద్రానికి స‌మాచారం అందించాల్సి ఉంటుంది.

వాట్సాప్‌లో ప్రైవ‌సీకి పెద్ద పీట వేశామ‌ని ఆ సంస్థ మ‌రోమారు స్ప‌ష్టం చేసింది. యూజ‌ర్ల‌కు పెద్ద ఎత్తున కొంద‌రు బ‌ల్క్ మెసేజ్‌ల‌ను పంపిస్తున్నార‌ని.. అది నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని.. అందుక‌నే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని.. వాట్సాప్ తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now