Anasuya : అన‌సూయ మ‌ళ్లీ అత్త అయిందిగా..?

February 3, 2022 10:35 AM

Anasuya : బుల్లితెర‌పై ఓ వైపు యాంక‌ర్‌గా రాణిస్తూనే అన‌సూయ మ‌రోవైపు వెండి తెర‌పై కూడా వ‌రుస సినిమాల‌తో అల‌రిస్తోంది. ఇటీవ‌లే విడుద‌లైన పుష్ప సినిమాలో ఆమె దాక్షాయ‌ణి అనే పాత్ర‌లో న‌టించి అంద‌రినీ మెప్పించింది. ఇక ప్ర‌స్తుతం ఆమె పుష్ప మూవీ రెండో పార్ట్‌లోనూ న‌టిస్తోంది. అలాగే ర‌వితేజ న‌టించిన ఖిలాడి సినిమాలో అన‌సూయ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది.

Anasuya yet again doing mother in law character in khiladi movie
Anasuya

అయితే ఖిలాడి సినిమాలో అన‌సూయ డ్యుయ‌ల్ రోల్ పోషించింద‌ని.. అందులో ఒక పాత్ర చ‌నిపోతుంద‌ని, ఒక పాత్ర సినిమా మొత్తం క‌నిపిస్తుంద‌ని.. సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ అందులో నిజం లేద‌ని తెలుస్తుంది. ఖిలాడి సినిమాలో అన‌సూయ కేవ‌లం ఒకే పాత్ర‌లో న‌టించింద‌ని.. అది కూడా ఓ హీరోయిన్‌కు త‌ల్లిగా.. అంటే.. ర‌వితేజ‌కు అత్త‌గా న‌టించింద‌ని స‌మాచారం.

ఇక ఖిలాడి సినిమాలో అన‌సూయ పాత్ర పేరు చంద్ర‌క‌ళ అని తెలుస్తోంది. కానీ దీనిపై అధికారిక స‌మాచారం లేదు. అయితే ఏమైనా అప్‌డేట్స్ విడుద‌ల చేస్తే అన‌సూయ పాత్ర‌పై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కానీ ఏపీలో అప్ప‌టి వ‌ర‌కు 50 శాతం ఆక్యుపెన్సీ, రాత్రి క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లిస్తారా.. లేదా.. అన్న‌ది చూడాలి.

ఖిలాడి మూవీకి ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల్లో మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఇందులో డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ మూవీ విడుద‌ల‌కు ముందే భారీగా బిజినెస్ చేసిన‌ట్లు తెలిసింది. దీంతో నిర్మాత ద‌ర్శ‌కుడికి ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now