Sreeleela : వామ్మో.. శ్రీ‌లీలకు డిమాండ్ బాగానే ఉందే..?

February 3, 2022 8:26 AM

Sreeleela : పెళ్లి సందD చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌. ఈ మూవీ విడుద‌లైన తొలినాళ్ల‌లో అంత‌గా ప్రేక్ష‌కులు స్పందించ‌లేదు. కానీ రాను రాను మౌత్ ప‌బ్లిసిటీతో హిట్ అయింది. ఇందులో ముఖ్యంగా శ్రీ‌లీల గ్లామ‌ర్‌, డ్యాన్స్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. దీంతో యువ‌త ఈ సినిమా చూసేందుకు ఆస‌క్తిని చూపించారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Sreeleela is getting very popular demanding more remuneration
Sreeleela

పెళ్లి సందD చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రూ.10 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది. దీంతో ఈ సినిమాకు అంత మొత్తం రావ‌డంపై ట్రేడ్ వ‌ర్గాలు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాయి. ఇందులో త‌న అందచందాల‌తోనే శ్రీ‌లీల క‌ట్టి ప‌డేసింద‌ని, ఆమె వ‌ల్ల‌నే సినిమా హిట్ అయింద‌ని అంచ‌నా వేశారు. అలాగే ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ మూవీకి ద‌ర్వ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు వ‌హించారు. దీంతో స‌హజంగానే మూవీ ప్రేక్ష‌కులకు న‌చ్చింది.

అయితే ఈ ఒక్క‌సినిమాలోనే శ్రీ‌లీల న‌టించినా.. ఈమె త‌న రెమ్యున‌రేష‌న్‌ను మాత్రం భారీగా పెంచిన‌ట్లు స‌మాచారం. పెళ్లి సందD చిత్రానికి ఈమెకు కేవ‌లం రూ.5 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. కానీ ఇప్పుడు ఈమె రూ.1 కోటి వ‌ర‌కు డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అంత మొత్తం ఇచ్చి ఈమెను కొంద‌రు నిర్మాత‌లు హీరోయిన్ గా త‌మ చిత్రాల్లోకి తీసుకుంటున్నార‌ట‌. ఏది ఏమైనా.. ఒక్క చిత్రంతోనే శ్రీ‌లీలకు డిమాండ్ బాగా పెరిగిపోవ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now