IPL : ప్రస్తుతం ఐపీఎల్‌ జట్ల వద్ద ఉన్న ప్లేయర్లు వీరే.. వేలంలో ప్లేయర్లను కొనేందుకు ఒక్కో జట్టు వద్ద ఇంకా ఎంత డబ్బు ఉందంటే..?

February 2, 2022 10:39 PM

IPL : ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో ఈ మెగావేలం జరగనుంది. ఇందులో 1200కు పైగా దేశీయ, విదేశీయ ప్లేయర్లకు వేలం వేయనున్నారు. వారిలో 800 మంది దేశీయ ప్లేయర్లు ఉండా.. 400 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఇక ఇప్పటికే జట్లు కొంత మంది ప్లేయర్లను రిటెయిన్‌ చేసుకున్నాయి. వారి వివరాలు ఇలా ఉన్నాయి.

IPL teams and their retained players list remaining purse balance for each team
IPL

చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌.. జడేజా, ధోనీ, గైక్వాడ్‌, మొయిన్‌ అలీలను దగ్గరే పెట్టుకుంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు రస్సెల్‌, వరుణ్‌ చక్రవర్తి, వెంకటేష్‌ అయ్యర్‌, సునీల్‌ నరైన్‌లను రిటెయిన్‌ చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, పృథ్వీ షా, నోర్‌జె లను రిటెయిన్‌ చేసుకుంది.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు వద్ద కోహ్లి, మాక్స్‌వెల్‌, సిరాజ్ లు ఉన్నారు. ముంబై ఇండియన్స్‌ వద్ద రోహిత్‌ శర్మ, బుమ్రా, సూర్య కుమార్‌ యాదవ్‌, పొల్లార్డ్‌లు ఉన్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌ వద్ద సంజు శాంసన్‌, జాస్‌ బట్లర్‌, జైశ్వాల్‌లు ఉన్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వద్ద కేన్‌ విలియమ్సన్‌, సమద్, యు.మాలిక్‌లు ఉన్నారు.

పంజాబ్‌ కింగ్స్‌ జట్టు వద్ద మయాంక్‌ అగర్వాల్‌, అర్షదీప్‌లు ఉన్నారు. అహ్మదాబాట్‌ టీమ్‌ హార్దిక్‌ పాండ్యా, రషీద్‌ ఖాన్‌, గిల్‌లను ఎంచుకుంది. లక్నో సూపర్‌ జియాంట్స్‌ జట్టు కేఎల్‌ రాహుల్‌, స్టాయినిస్‌, బిష్ణోయ్‌లను ఎంపిక చేసుకుంది.

ఇక మెగా వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు గాను ఒక్కో జట్టు వద్ద ఇంకా ఎంత డబ్బు మిగిలి ఉందో ఇప్పుడు చూద్దాం. చెన్నై వద్ద రూ.48 కోట్లు, కోల్‌కతా వద్ద రూ.48 కోట్లు, ఢిల్లీ వద్ద రూ.47.5 కోట్లు ఉన్నాయి. బెంగళూరు వద్ద రూ.57 కోట్లు, ముంబై వద్ద రూ.48 కోట్లు, రాజస్థాన్‌ వద్ద రూ.62 కోట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. హైదరాబాద్‌ వద్ద ప్లేయర్లను కొనేందుకు ఇంకా రూ.68 కోట్లు ఉండగా.. పంజాబ్‌ వద్ద రూ.72 కోట్లు బ్యాలెన్స్‌ ఉన్నాయి. అహ్మదాబాద్‌ వద్ద రూ.52 కోట్లు ఉండగా, లక్నో వద్ద రూ.58 కోట్లు ఉన్నాయి.

జట్లన్నీ తమ వద్ద మిగిలిన మొత్తంతోనే ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న వేలంలో ఏయే జట్లు ఏయే ప్లేయర్లను కొనుగోలు చేస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now