Brahmanandam : బ్ర‌హ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. షాక‌వ్వాల్సిందే..!

February 1, 2022 10:14 PM

Brahmanandam : బ్ర‌హ్మానందం.. ఈ పేరు చెబితే చాలు.. తెలుగు సినీ ప్రేక్ష‌కుల ముఖాల‌పై చిన్న‌గా చిరున‌వ్వు వ‌స్తుంది. అస‌లు ఆయ‌న ఫొటోను చూస్తే న‌వ్వు వ‌స్తుంది. అంత‌లా ఈయ‌న తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయారు. ఎన్నో వంద‌ల చిత్రాల్లో ఈయ‌న కామెడీ చేసి కడుపుబ్బా న‌వ్వించారు. స్టార్ హీరోలు సైతం త‌మ సినిమాల్లో బ్రహ్మానందానికి ప్ర‌త్యేకంగా పాత్ర‌ల‌ను క్రియేట్ చేసి మ‌రీ ఆయ‌న‌ను సినిమాల్లో తీసుకుంటుంటారు. అంత‌టి క్రేజ్ ఆయ‌న‌కు సొంతం.

Brahmanandam assets value do you know about it
Brahmanandam

సోష‌ల్ మీడియాలోనూ బ్రహ్మానందం హ‌వా న‌డుస్తోంది. ఆయ‌న‌ను మీమ్స్ కోసం ఎన్ని ర‌కాలుగా ఉప‌యోగించుకున్నారంటే.. బ‌హుశా ఏ క‌మెడియ‌న్‌ను కూడా ఆ విధంగా నెటిజ‌న్లు వాడుకోలేదు. అందుక‌నే ఆయ‌న ఫొటో క‌నిపిస్తే చాలు.. ఎవ‌రికైనా స‌రే ఇట్టే న‌వ్వు వ‌స్తుంది. ఆయ‌న తెర‌పై క‌నిపిస్తే చాలు.. స్టార్ హీరోల‌కు ల‌భించిన మ‌ర్యాద ద‌క్కుతుంది. ఫ్యాన్స్ ఈల‌లు వేసి చ‌ప్ప‌ట్లు కొడుతుంటారు.

Brahmanandam : గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం..

ఇక బ్ర‌హ్మానందం ఇప్ప‌టికే 1250కి పైగా చిత్రాల్లో న‌టించారు. ఆయ‌న సినిమాల్లోని డైలాగ్స్ ఇప్ప‌టికీ పాపుల‌రే. ఆయ‌న కామెడీ సీన్స్ ఎవ‌ర్‌గ్రీన్‌. 2010లో ఆయ‌న‌కు గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం ద‌క్కింది. సినిమాలో బ్ర‌హ్మానందం ఉన్నారంటే చాలు.. కామెడీ ప‌క్కా.. కచ్చితంగా చూడాల్సిందే.. అని చెప్పి కూడా సినిమాకు వెళ్తుంటారు. అంత‌టి పాపులారిటీ ఆయ‌న సొంతం.

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక స్థాయిలో రెమ్యున‌రేష‌న్ అందుకున్న క‌మెడియ‌న్‌గా కూడా బ్రహ్మానందం టాప్ ప్లేస్‌లో నిలుస్తారు. ఇక ఈయ‌న ఆస్తుల విష‌యానికి వ‌స్తే.. రూ.450 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. బ్రహ్మానందం సినిమాల్లో న‌టించి డ‌బ్బులు సంపాదిస్తార‌ని అంద‌రికీ తెలుసు. కానీ ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ కూడా చేస్తార‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. అందుక‌నే ఆయ‌న‌కు అన్ని వంద కోట్ల ఆస్తులు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now