Kidney : కిడ్నీలు ఫెయిల్‌ అయినవారిలో కనిపించే లక్షణాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి..!

February 1, 2022 10:46 AM

Kidney : మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇవి మన శరీరంలో ఉండే విష పదార్థాలను, వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీరంలోని రక్తాన్ని కిడ్నీలు ఫిల్టర్‌ చేస్తాయి. వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఫిల్టర్‌ అయిన రక్తాన్ని శరీరానికి అందిస్తాయి. ఇలా కిడ్నీలు నిరంతరాయం పనిచేస్తూనే ఉంటాయి. వ్యర్థాలను తొలగిస్తూనే ఉంటాయి. అయితే కొన్ని కారణాల వల్ల కొందరిలో కిడ్నీలు చెడిపోతుంటాయి. కిడ్నీ వ్యాధులు వచ్చి కిడ్నీలు ఫెయిల్‌ అవుతుంటాయి. అలాంటప్పుడు శరీరం మనకు కొన్ని లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని గమనించడం ద్వారా ముందుగానే సమస్యను గుర్తించి జాగ్రత్త పడవచ్చు. తగిన సమయంలో చికిత్స తీసుకుని కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. మరి కిడ్నీలు ఫెయిల్‌ అయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

Kidney failure symptoms you should be aware of
Kidney

1. కిడ్నీలు ఫెయిల్‌ అయిన వారిలో తీవ్రమైన అలసట ఉంటుంది. చిన్న పని చేసినా త్వరగా అలసిపోతుంటారు.

2. తరచూ కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. వికారంగా ఉంటుంది. వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. కొందరికి వాంతులు కూడా అవుతుంటాయి.

3. కిడ్నీలు ఫెయిల్‌ అయిన వారిలో కంగారు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. ఏ పని మీద దృష్టి పెట్టలేరు. ఏకాగ్రత లోపిస్తుంది.

4. శరీరంలో ఎక్కడ చూసినా వాపులు కనిపిస్తాయి. ముఖ్యంగా చేతులు, కాళ్లు వాపులకు గురవుతాయి. పాదాలు, మడమల దగ్గర వాపు బాగా ఉంటుంది. చేతి వేలితో వాపుపై నొక్కితే గుంతలాగా ఏర్పడుతుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌కు కచ్చితమైన సంకేతం అని చెప్పవచ్చు.

Kidney : తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది..

5. కిడ్నీలు చెడిపోయిన వారు తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. మూత్రాన్ని అసలు ఆపుకోలేకపోతుంటారు. దుస్తుల్లోనే అయిపోతుంటుంది.

6. రాత్రి పూట కాళ్ల కండరాలు, పిక్కలు పట్టేయడం బాగా జరుగుతూ ఉంటే అలాంటి వారిలో కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయని గుర్తించాలి.

7. చర్మం పొడిగా మారుతున్నా, దురదలు పెడుతున్నా.. కిడ్నీల సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి.

8. కిడ్నీలు ఫెయిల్‌ అయినవారిలో ఆకలి అసలు ఉండదు. ఏం తినాలని అనిపించదు. నాలుక లోహం రుచి మాదిరిగా అనిపిస్తుంటుంది. ఇనుమును రుచి చూస్తే ఎలా ఉంటుందో అలా నాలుక రుచి ఉంటుంది.

పైన తెలిపినవన్నీ కిడ్నీలు ఫెయిల్‌ అయినవారిలో కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ సూచన మేరకు చికిత్స తీసుకోవాలి. మందులను వాడాలి. అలాగే సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. రోజూ తగినంత నీటిని తాగాలి. కొలెస్ట్రాల్‌, బీపీ, షుగర్‌ ఉన్నవారు వాటిని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేదంటే కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అధిక బరువు ఉన్నవారు దాన్ని తగ్గించుకుంటే కిడ్నీలపై భారం పడకుండా ఉంటుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment