Pushpa Movie : పుష్ప సినిమాకు.. ఈ చెప్పుల‌కు సంబంధం ఏమిటి ?

January 31, 2022 10:15 PM

Pushpa Movie : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టించిన పుష్ప ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీకి వాళ్లు, వీళ్లు అన్న తేడా లేదు. సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్లు అంద‌రూ ఫిదా అయిపోయారు. పుష్ప సినిమా తెలుగు మాత్ర‌మే కాకుండా ప‌లు ఇత‌ర భార‌తీయ భాష‌ల్లోనూ రిలీజ్ అయింది. అయితే హిందీలో బంప‌ర్ హిట్ అయింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మార‌గా.. ఆయ‌న‌తో న‌టించేందుకు అనుప‌మ్ ఖేర్ వంటి ప్ర‌ముఖ హిందీ న‌టులు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు.

what is the relation between this chappal and Pushpa Movie
Pushpa Movie

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ కూడా పెరిగిపోయింది. ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు ఏకంగా రూ.100 కోట్ల రెమ్యున‌రేష‌న్ కూడా ఇస్తామ‌ని నిర్మాత‌లు ముందుకు వ‌స్తున్నారు. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేసిన శ్రీ‌వ‌ల్లి స్టెప్ ఎంతో మందిని ఆక‌ట్టుకుంది. అనేక మంది స్టార్స్‌, క్రికెటర్లు అల్లు అర్జున్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తున్నారు.

Pushpa Movie : సోష‌ల్ మీడియాలో మీమ్స్..

శ్రీ‌వ‌ల్లి సాంగ్‌లో అల్లు అర్జున్ స్టెప్ వేస్తూ.. కాలికి ఉన్న చెప్పును విడిచిపెడ‌తాడు. మ‌ళ్లీ తొడుక్కుంటాడు. ఇది భ‌లే క్రేజీగా అనిపించింది. ఆ పాట‌లో ప‌లుమార్లు అల్లు అర్జున్ ఈ స్టెప్ ను వేశాడు. అయితే చాలా మంది ఇలాగే చెప్పును విడిచి స్టెప్ వేస్తూ త‌మ స‌రదా తీర్చుకుంటున్నారు. ఇక సోష‌ల్ మీడియాలోనూ ఇదే స్టెప్ గురించి అనేక మీమ్స్ వ‌స్తున్నాయి. వాటిల్లోని ఒక ఫొటోనే ఈ చెప్పు.

అల్లు అర్జున్ ఆ పాట‌లో ఆ స్టెప్పు వేసేందుకు చాలా టేక్‌లు తీసుకుని ఉంటాడ‌ని.. దీంతో ఆయ‌న చెప్పులు ఆ విధంగా అరిగిపోయి ఉంటాయ‌ని.. చాలా మంది ఈ చెప్పుల‌తో జోక్‌లు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ ఫొటో వైర‌ల్ అవుతోంది. చాలా మంది ఈ మీమ్‌ను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now