Naga Chaitanya : ఓటీటీలో క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్‌లో న‌టించ‌నున్న నాగ‌చైత‌న్య‌..?

January 29, 2022 8:39 AM

Naga Chaitanya : స‌మంత‌, నాగ‌చైత‌న్య‌.. విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత ఇద్ద‌రూ సినిమాల్లో బిజీ అయ్యారు. ఇద్ద‌రూ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నారు. స‌మంత పుష్ప ఐట‌మ్ సాంగ్‌తో మెర‌వ‌గా.. చైత‌న్య శేఖ‌ర్ క‌మ్ముల‌తో ల‌వ్ స్టోరీ తీసి హిట్ కొట్టాడు. అలాగే తాజాగా బంగార్రాజు మూవీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఇక ఇప్పుడు థాంక్ యూ అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో రాశీ ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Naga Chaitanya reportedly may act in OTT crime thriller series

కాగా నాగ‌చైత‌న్య బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు. న‌టుడు అమీర్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లాల్ సింగ్ చ‌డ్డా అనే మూవీలో చైతూ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇక తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. నాగ‌చైత‌న్య ఓటీటీల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ నిర్మించ‌నున్న ఓ వెబ్ సిరీస్‌లో చైతూ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

భారీ బ‌డ్జెట్‌తో అమెజాన్ సంస్థ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో చైత‌న్య జ‌ర్న‌లిస్టు పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. అయితే ఇందులో చైత‌న్య పూర్తిగా నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్ర చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే ఇందుకు గాను చైతన్య త‌న మేకోవ‌ర్‌ను కూడా పూర్తిగా మార్చుకోనున్నాడ‌ని తెలుస్తోంది. మొత్తం 3 సీజ‌న్లుగా ఈ సిరీస్‌ను తీయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఒక సీజ‌న్‌కు సుమారుగా 8 నుంచి 10 ఎపిసోడ్లు ఉంటాయ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సిరీస్‌కు సంబంధించి అధికారికంగా వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now