Gamanam Movie : న‌టి శ్రియా శ‌ర‌న్ న‌టించిన గ‌మ‌నం చిత్రం ఓటీటీలో.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే..?

January 28, 2022 7:36 PM

Gamanam Movie : సంజ‌నా రావు ద‌ర్శ‌కత్వంలో న‌టి శ్రియా శ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం.. గ‌మ‌నం. శివ కందుకూరి, ప్రియాంక జ‌వాల్క‌ర్‌, నిత్యా మీన‌న్‌లు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. క్రియ ఫిలిం కార్ప్‌, క‌లి ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ల‌పై ర‌మేష్ కురుటూర‌, వెంకీ పుష్ప‌ద‌పు, జ్ఞాన‌శేఖ‌ర్‌, వీఎస్‌లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.

Gamanam Movie  to stream in ott know which app

గ‌మ‌నం సినిమాను ప‌లు య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కించారు. పూర్తిగా భావోద్వేగపూరిత‌మైన పాత్ర‌లు ఇందులో క‌నిపిస్తాయి. డిసెంబ‌ర్ 10, 2021వ తేదీన ఈ మూవీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఇందులో శ్రియాతోపాటు నిత్యామీన‌న్‌, ఇత‌ర న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు మంచి మార్కులే ప‌డ్డాయి.

కాగా గ‌మ‌నం మూవీ ఓటీటీలో ప్ర‌సారం కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని స్ట్రీమ్ చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి 28 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో శ్రియ దివ్యాంగురాలి పాత్ర‌లో న‌టించింది. నిత్యామీన‌న్ అతిథి పాత్ర‌లో క‌నిపించింది. ఇళ‌య‌రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. ముందుగా తెలుగులో విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో హిందీ, మ‌ళ‌యాళం, త‌మిళం, క‌న్నడ భాష‌ల్లో ఈ మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా ఈ మూవీకి డైలాగ్స్ రాశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment