Gangubai : ఆలియా భ‌ట్ గంగూబాయి మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

January 28, 2022 2:31 PM

Gangubai : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలి తెర‌కెక్కించిన తాజా చిత్రం.. గంగూబాయి క‌తియ‌వాడి. ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ మూవీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Gangubai Kathiawadi movie release date fixed

ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన గంగూబాయి మూవీలో అజ‌య్ దేవ‌గ‌న్ కీల‌కపాత్ర‌లో న‌టించారు. ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

సంజ‌య్ లీలా భ‌న్సాలి, డాక్ట‌ర్ జ‌యంతిలాల్ గ‌దాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. దీన్ని ప్ర‌ఖ్యాత 72వ బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

1960ల‌లో కామ‌టిపుర అనే ఏరియాలో అత్యంత శ‌క్తివంత‌మైన మ‌హిళ‌గా పేరుగాంచి గంగూబాయి అనే మ‌హిళ జీవితం ఆధారంగా గంగూబాయి క‌తియ‌వాడి మూవీని తెర‌కెక్కించారు. క్రైమ్ డ్రామా నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో ఇమ్రాన్ హ‌ష్మి కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now