RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీ.. మ‌ళ్లీ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌కు ప్లాన్ చేస్తున్న రాజ‌మౌళి..?

January 28, 2022 8:31 AM

RRR Movie : ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేద్దామ‌ని ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగా చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హించింది. అయితే కోవిడ్ మూడో వేవ్ కార‌ణంగా ఈ చిత్ర విడుద‌ల‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు.

RRR Movie  director ss rajamouli reportedly in plan of promotions again

ఇటీవ‌లే రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను రెండు విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించారు. మార్చి 18 లేదా ఏప్రిల్ 28 తేదీల్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని తెలిపారు. అయితే మార్చి 17న క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన సినిమాల‌ను వారం రోజుల పాటు అక్క‌డ థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. దీంతో ఇత‌ర ఏ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించేది లేద‌ని అక్క‌డి డిస్ట్రిబ్యూట‌ర్లు చెప్పారు. అందువ‌ల్ల మార్చి 18వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుద‌ల సాధ్యం కాద‌ని అంటున్నారు. దీంతో ఏప్రిల్ 28 ఒక్క‌టే ఆప్ష‌న్ మిగిలింది.

అయితే ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. కానీ ఏప్రిల్ 28 తేదీనే క‌న్‌ఫామ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మ‌ళ్లీ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌పై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.

జ‌న‌వ‌రిలో సినిమా విడుద‌ల వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా చిత్ర యూనిట్ దాదాపుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసింది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ చిత్ర విడుద‌ల వాయిదా ప‌డింది. దీంతో నిర్మాత‌కు కేవ‌లం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌కే రూ.30 కోట్ల మేర న‌ష్టం వ‌చ్చింద‌ని అన్నారు. అయితే ఏప్రిల్ 28వ తేదీన చిత్రాన్ని విడుద‌ల చేసేందుకే అధికంగా అవ‌కాశాలు ఉన్నాయి క‌నుక‌.. అప్ప‌టి వ‌ర‌కు ఇంకా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి.. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారం లేదా మార్చి మొద‌టి వారం నుంచి ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మ‌ళ్లీ ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. అందుకు గాను ఇప్ప‌టి నుంచే రాజ‌మౌళి గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నార‌ట‌. అయితే ఈసారైనా ఆర్ఆర్ఆర్ మూవీ ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుద‌ల‌వుతుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now