Allu Arjun : దుబాయ్ స్కైలైన్‌లో ఫ్యామిలీతో క‌లిసి అల్లు అర్జున్ ఎంజాయ్‌.. అద్భుత‌మైన దృశ్యం..

January 27, 2022 10:04 PM

Allu Arjun : ప్ర‌స్తుతం ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఆయ‌న న‌టించిన పుష్ప ది రైజ్ చిత్రం మామూలు హిట్ కాలేదు. ఇందులో అల్లు అర్జున్ స్టైల్‌కు సినీ ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. ప్ర‌తి ఒక్క‌రూ పుష్ప స్టైల్‌ను అనుక‌రిస్తూ త‌మ స‌ర‌దా తీర్చుకుంటున్నారు. విదేశీయులు సైతం పుష్ప స్టైల్‌కు ఆక‌ర్షితుల‌య్యారు. పుష్ప ఫీవర్ ప్ర‌స్తుతం మామూలుగా లేదు.

Allu Arjun spending vacation with family in dubai sky line view

అయితే పుష్ప రెండో భాగ‌మైన పుష్ప ది రూల్ షూటింగ్ ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలోనే రెండో పార్ట్‌ను మొద‌టి పార్ట్ క‌న్నా మ‌రింత భిన్నంగా సుకుమార్ తెర‌కెక్కించ‌నున్నారు. దీంతో రెండో పార్ట్ పై మ‌రింత ఆస‌క్తి పెరిగింది. అందులో అల్లు అర్జున్ మ‌రింత‌గా అల‌రిస్తార‌ని తెలుస్తోంది.

అయితే పుష్ప రెండో పార్ట్ మూవీ ప్రారంభం అయితే ఇక వెకేష‌న్‌కు వెళ్లేంత స‌మ‌యం ఉండదు. అందుక‌ని అల్లు అర్జున్ త‌న ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్‌కు వెళ్లారు. అక్క‌డ ఔరా స్కై పూల్‌లో ఆయ‌న కుటుంబంతో గ‌డిపారు. అక్క‌డి నుంచి దుబాయ్ స్కై లైన్ వ్యూను వీక్షించారు. అది ఎంతో అద్భుతంగా ఉండ‌డం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

దుబాయ్‌లో స్కై లైన్ వ్యూకు సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్ షేర్ చేశారు. బిల్డింగ్ అంచున నిల‌బ‌డి దుబాయ్ అందాల‌ను చూస్తుంటే వర్ణించ‌న‌ల‌వి కాకుండా ఉంది. ఇక దుబాయ్‌లో వెకేష‌న్ ముగిసిన వెంట‌నే అల్లు అర్జున్ హైద‌రాబాద్‌కు ప్ర‌యాణ‌మై ఇక్క‌డ‌కు రాగానే పుష్ప రెండో పార్ట్ షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now