Mouni Roy : నాగిని సీరియల్‌ నటి.. ఎట్టకేలకు వివాహం చేసుకుంది..!

January 27, 2022 9:20 PM

Mouni Roy : బుల్లితెరపై నటి మౌనీరాయ్‌ ఎంత గుర్తింపు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈమె నటించిన నాగిని సీరియల్‌ ఎంతో పాపులర్‌ అయింది. ఈ సీరియల్‌ ద్వారా ఆమె పాపులర్‌ అవడమే కాదు, పలు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు మౌనీ రాయ్‌ వివాహం చేసుకుంది.

Mouni Roy married suraj nambiar photos viral

మౌనీ రాయ్‌.. వ్యాపారవేత్త సూరజ్‌ నంబియార్‌ను వివాహం చేసుకుంది. వీరి వివాహం తాజాగా అంగరంగ వైభవంగా జరిగింది. సూరజ్‌తో చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్న మౌనీ రాయ్‌ ఎట్టకేలకు తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

నాగిని టీవీ సీరియల్‌ ద్వారా మౌనీ రాయ్‌ ఎంతో పేరు తెచ్చుకుంది. తనదైన అందచందాలతో ఈమె ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటుంది. ఇక ఈమె కేజీఎఫ్‌ హిందీ వెర్షన్‌లో ప్రత్యేక పాటలో అలరించింది.

గురువారం ఉదయం మౌనీరాయ్‌, సూరజ్‌ల వివాహ వేడుక ఘనంగా జరిగింది. గోవాలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నడుమ వీరు వివాహం చేసుకున్నారు. సంప్రదాయ బద్ధంగా వీరి వివాహం జరిగింది.

మౌనీ రాయ్‌, సూరజ్‌ల వివాహ వేడుకకు ప్రముఖ నటి మందిరా బేడీ హాజరైంది. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now