Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ప్రియుల‌కు గుడ్‌న్యూస్‌.. బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అయ్యేది అప్పుడే..?

January 27, 2022 5:15 PM

Bigg Boss OTT Telugu : బుల్లితెర‌పై బిగ్ బాస్ 5 తెలుగు ఎంత‌గా ఆక‌ట్టుకుందో అంద‌రికీ తెలిసిందే. ఈ సీజ‌న్‌కు మొద‌ట్లో పెద్ద‌గా రేటింగ్స్ రాలేదు కానీ.. రాను రాను షోలో రొమాన్స్ ఎక్కువ అవ‌డం కార‌ణం వ‌ల్ల రేటింగ్స్ త‌రువాత రోజుల్లో పెరిగిపోయాయి. ఓ ద‌శ‌లో షోను కొంద‌రు విమ‌ర్శించారు కూడా. షోలో మ‌రీ రొమాన్స్ ఎక్కువైంద‌ని చాలా మంది విమ‌ర్శ‌లు చేశారు.

Bigg Boss OTT Telugu may start soon in that week

అయితే విమ‌ర్శ‌లను సైతం త‌ట్టుకుని బిగ్ బాస్ 5 తెలుగు ఎట్ట‌కేల‌కు విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ క్ర‌మంలోనే ఈ షోకు ల‌భించిన ఆద‌ర‌ణ దృష్ట్యా త్వ‌ర‌లోనే బిగ్ బాస్ ఓటీటీ ని కూడా ప్రారంభిస్తామ‌ని, దానికి తానే స్వ‌యంగా గెస్ట్‌గా ఉంటాన‌ని కూడా నాగార్జున తెలిపారు. దీంతో బిగ్ బాస్ ఓటీటీ ఎప్ప‌టి నుంచి ప్రారంభం అవుతుందా.. అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించి ఒక అప్‌డేట్ తెలుస్తోంది. ఈ షోను ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారం నుంచి ప్ర‌సారం చేస్తార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల‌ను కూడా ఇప్ప‌టికే ఎంపిక చేశార‌ని స‌మాచారం. త్వ‌ర‌లో వారిని క్వారంటైన్‌కు త‌ర‌లిస్తార‌ని తెలుస్తోంది.

కాగా బిగ్ బాస్ ఓటీటీ 82 రోజుల పాటు రోజుకు 24 గంట‌లూ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానుంది. గ‌తంలో షో రోజుకు 1 గంట నుంచి 2 గంట‌ల మేర మాత్ర‌మే ప్ర‌సారం అయ్యేది. కానీ బిగ్ బాస్ ఓటీటీ మాత్రం 24 గంట‌లూ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానుంది. దీంతో రోజంతా ప్రేక్ష‌కుల‌కు వినోదం ల‌భ్యం కానుంది.

హిందీలో ఇప్ప‌టికే బిగ్ బాస్ ఓటీటీ హిట్ అయిన దృష్ట్యా తెలుగులోనూ దాన్ని ప్రారంభించ‌నున్నారు. అయితే ఈ షో 24 గంట‌లూ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అవుతుంది క‌నుక దీని ప‌ట్ల ప్రేక్ష‌కులు అంత‌గా ఆస‌క్తిని చూపిస్తారా.. లేదా.. అన్న‌ది సందేహంగా మారింది. ఆ విష‌యం తెలియాలంటే ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారం వ‌ర‌కు ఆగాల్సిందే..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now