Tirumala Darshan Tickets : ఈ నెల 28న తిరుమ‌ల శ్రీ‌వారి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టిక్కెట్ల విడుద‌ల

January 27, 2022 11:37 AM

Tirumala Darshan Tickets : క‌రోనా నేప‌థ్యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వారు ప్ర‌తి నెలా ప్ర‌త్యేక ద‌ర్శ‌న టోకెన్ల‌ను నిర్దిష్ట‌మైన మొత్తంలో విడుద‌ల చేస్తున్న విష‌యం విదిత‌మే. రోజూ ఒక నిర్దిష్ట‌మైన సంఖ్య‌లో మాత్ర‌మే భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు. అందుకు అనుగుణంగానే టిక్కెట్ల‌ను విడుద‌ల చేస్తున్నారు. ఇక ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించి ప్ర‌త్యేక ద‌ర్శ‌న టిక్కెట్ల‌ను కూడా విడుద‌ల చేయ‌నున్నారు.

Tirumala Darshan Tickets  for February month will be released on 28th January 2022

ఈ నెల 28వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టిక్కెట్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 29వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు టైమ్ స్లాట్ స‌ర్వ‌ద‌ర్శ‌న టిక్కెట్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. భ‌క్తులు ఆయా స‌మ‌యాల్లో టిక్కెట్ల‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

క‌రోనా కార‌ణంగా తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఇప్ప‌టికే కోవిడ్ నెగెటివ్ స‌ర్టిఫికెట్‌ను, టీకా స‌ర్టిఫికెట్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు. అలిపిరి మార్గం వ‌ద్దే ఆయా ప‌త్రాల‌ను క్షుణ్ణంగా త‌నిఖీలు చేసి మ‌రీ పంపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now