Ram Charan Upasana : వివాదంలో చిక్కుకున్న రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న‌.. సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టే కార‌ణం..

January 27, 2022 9:39 AM

Ram Charan Upasana : న‌టుడు రామ్ చ‌ర‌ణ్ తేజ్ స‌తీమ‌ణి ఉపాస‌న ఎప్పుడూ ఏదో ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొంటూ ఉంటారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈమె పెట్టే పోస్టులు అంద‌రినీ ఆలోచింప‌జేస్తుంటాయి. ఉపాస‌న ఎప్పుడూ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇందుకు గాను ఆమె నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఈమె సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టు మాత్రం కొంద‌రి ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతోంది. ఆమె పోస్టు వివాదాల్లో నిలిచింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

Ram Charan Upasana in controversy about social media post

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌జ‌లు శుభాకాంక్ష‌లు తెలిపిన ఉపాస‌న ఓ ఆల‌యం ఫొటోను త‌న ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఆ ఆల‌య గోపురంలో సూక్ష్మ రూపంలో చాలా మంది ప్ర‌జ‌లు ఉన్నారు. వారి మ‌ధ్య‌లో తాను, త‌న భ‌ర్త రామ్ చ‌ర‌ణ్ కూడా ఉన్నామ‌ని.. తాము ఆ ఫొటోలో ఎక్క‌డ ఉన్నామో క‌నుక్కోండి.. అంటూ ఉపాస‌న ఓ ఫొటోను షేర్ చేశారు.

వాస్త‌వానికి ఫొటో ఆల‌య శిఖ‌రందే అయిన‌ప్ప‌టికీ దాన్ని ఎడిట్ చేశారు. ఆ శిఖ‌రంపై ప్ర‌జ‌లు సూక్ష్మ రూపంలో ఉన్న‌ట్లుగా ఫొటోను ఎడిట్ చేశారు. దీంతో ఆ ఫొటోను ఎడిట్ చేసింది ఎవ‌రో చెప్పాల‌ని ఉపాస‌న కోరారు.

అయితే ఉపాస‌న షేర్ చేసిన ఈ ఫొటో వివాదానికి కార‌ణ‌మైంది. ఆల‌య శిఖ‌రం ఎంతో ప‌విత్ర‌మైంద‌ని, దానిపై మ‌నుషులు ఉండేలా ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ నిజంగా ఎవ‌రో తెలిస్తే చెప్పండి.. అస‌లైన స‌న్మానం చేస్తాం.. అని నెటిజ‌న్లు అంటున్నారు. ఈ విధ‌మైన ఫొటోను షేర్ చేసిన ఉపాస‌న‌పై కూడా వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. హిందువుల‌ను అవ‌మానించేలా వ్య‌వ‌హ‌రించార‌ని.. వెంట‌నే ఆమె క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, ఆ ఫొటోను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విష‌యంపై ఉపాస‌న స్పందించాల్సి ఉంది.

https://www.facebook.com/upasanakonidelaofficial/posts/486063256208727

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now