RRR Movie : ఏప్రిల్ 28వ తేదీనే ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌..? కార‌ణం ఇదేనా..?

January 27, 2022 8:21 AM

RRR Movie : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో.. ఎన్‌టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ తేజ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేద్దామ‌ని అన్ని ఏర్పాట్లు చేశారు. ప్ర‌మోష‌న్ల‌తోపాటు ప‌లు ఈవెంట్ల‌ను కూడా నిర్వ‌హించారు. కానీ కోవిడ్ మూడో వేవ్ నేప‌థ్యంలో అనేక చోట్ల థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు ఉండ‌డం, కొన్ని చోట్ల పూర్తిగా మూసివేయ‌డంతో.. ఈ చిత్రం విడుద‌ల‌ను వాయిదా వేశారు.

RRR Movie may release on April 28th this may be the reason

అయితే ఈ మ‌ధ్యే ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సినిమా విడుద‌ల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28వ తేదీ.. రెండింటిలో ఏదో ఒక తేదీన మూవీని విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయితే మార్చి 18వ తేదీన సినిమా విడుద‌ల లేన‌ట్లే అని తెలుస్తోంది. ఎందుకంటే ఆ రోజు క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ న‌టించిన తాజా చిత్రం జేమ్స్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

మార్చి 17వ తేదీన పునీత్ రాజ్ కుమార్ జ‌యంతి ఉంది. అందువ‌ల్ల మార్చి 18న ఆయ‌న సినిమా జేమ్స్‌ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ చూస్తున్నారు. ఇక గ‌తేడాది అక్టోబ‌ర్‌లో ఆయ‌న గుండెపోటుతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మార్చి 18 నుంచి వారం పాటు కేవ‌లం పునీత్ రాజ్ కుమార్ సినిమాల‌ను మాత్ర‌మే థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించాల‌ని క‌న్న‌డ ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్ల సంఘం నిర్ణ‌యించింది. అందువ‌ల్ల ఆ వారం రోజుల పాటు కర్ణాట‌క‌లో ఇత‌ర ఏ సినిమాలు ప్ర‌ద‌ర్శితం కావు. ఆర్ఆర్ఆర్ కూడా అందుకు మిన‌హాయింపు ఏమీ కాదు. క‌నుక మార్చి 18వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుద‌ల కాన‌ట్లే అని స్ప‌ష్ట‌మ‌వుతుంది.

ఇక మిగిలి ఉన్న తేదీ ఏప్రిల్ 28. క‌నుక ఆ తేదీ రోజునే ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. మార్చి అంటే అప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసులు కొంత వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టినా.. థియేట‌ర్లు పూర్తిగా ఓపెన్ అయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. అదే ఏప్రిల్ 28 అయితే అప్ప‌టి వ‌ర‌కు ప‌రిస్థితుల్లో ఇంకా బాగా మార్పు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. క‌నుక ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్ ఏప్రిల్ 28వ తేదీనే ఆ చిత్రాన్ని విడుద‌ల చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. మ‌రి ఈ విష‌యంపై చివ‌రికి ఏం నిర్ణ‌యిస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now