Balakrishna : మ‌రింత రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న బాల‌య్య‌..?

January 26, 2022 8:54 PM

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ ఈ మ‌ధ్య కాలంలో అటు వెండితెర ప్రేక్ష‌కుల‌తోపాటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా దగ్గ‌ర‌య్యారు. ఆహా ఓటీటీ యాప్‌లో త‌న అన్‌స్టాప‌బుల్ టాక్ షోతో ఎంతో మంది అభిమానుల ప్ర‌శంస‌లు పొందారు. ఆయన త‌న‌దైన శైలిలో నిర్వ‌హించిన టాక్ షోకు ఎంతో ఆద‌ర‌ణ లభించింది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో అన్‌స్టాప‌బుల్ షో సీజ‌న్ 1 ఫైన‌ల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

Balakrishna demands more for unstoppable second season

ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన అన్‌స్టాప‌బుల్ షో తొలి సీజ‌న్‌కు గాను చివ‌రి ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేయ‌నున్నారు. అందులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బాల‌య్య‌తో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు. స‌ద‌రు ఎపిసోడ్‌కు చెందిన షూటింగ్‌ను ఇప్ప‌టికే పూర్తి చేయ‌గా.. దానికి సంబంధించిన ప్రోమో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

అయితే తొలి సీజ‌న్ స‌క్సెస్ కావ‌డంతో ఆహా వారు రెండో సీజ‌న్‌ను ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రెండో సీజ‌న్‌కు బాల‌కృష్ణ‌ను ఒప్పించే ప‌నిలో ప‌డిన‌ట్లు స‌మాచారం. తొలి సీజ‌న్‌కు ఊహించ‌ని రేటింగ్స్ రావ‌డంతో రెండో సీజ‌న్‌ను నిర్వ‌హించాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బాల‌కృష్ణ మ‌రో మారు ఆహాలో అల‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది.

అయితే రెండో సీజ‌న్‌కు బాల‌య్య మ‌రింత రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. తొలి సీజ‌న్‌లో ఆయ‌న ఒక ఎపిసోడ్‌కు రూ.40 ల‌క్ష‌ల చొప్పున మొత్తం రూ.5 కోట్లు తీసుకున్నార‌ని స‌మాచారం. ఇక రెండో సీజ‌న్‌కు ఆయ‌న భారీగానే అడుగుతున్నార‌ని తెలుస్తోంది. అయితే రెండో సీజ‌న్‌పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now