Pushpa Movie : పుష్ఫ ఫీవ‌ర్ మామూలుగా లేదుగా.. ఈసారి క్రికెట‌ర్ బ్రేవో అల్లు అర్జున్‌లా చేశాడు.. వీడియో..!

January 26, 2022 8:06 AM

Pushpa Movie : పుష్ప సినిమా విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ప్రేక్ష‌కులు ఆ మూవీకి బాగా క‌నెక్ట్ అయ్యారు. అందులో అల్లు అర్జున్ త‌న భుజాన్ని పైకెత్తి న‌డిచే స్టైల్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. దీంతో అదే స్టైల్‌ను చాలా మంది ఫాలో అవుతూ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం పుష్ప స్టైల్‌ను ఫాలో అయ్యారు.

Pushpa Movie  cricketer bravo imitated allu arjun

ఇప్ప‌టికే ర‌వీంద్ర జ‌డేజా, శిఖ‌ర్ ధావ‌న్‌, డేవిడ్ వార్న‌ర్ వంటి వారు పుష్ప స్టైల్‌ను అనుక‌రించి స్టెప్పులు వేసి ఆక‌ట్టుకున్నారు. ఇక తాజాగా విండీస్ మాజీ క్రికెట‌ర్ డ్వేన్ బ్రేవో కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. వికెట్ తీసిన అనంత‌రం పుష్ప‌లా న‌డుస్తూ అల‌రించాడు.

తాజాగా జ‌రిగిన బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్ మ్యాచ్‌లో బ్రేవో వికెట్ తీసిన అనంత‌రం ఆ విధంగా పుష్ప స్టైల్‌ను అనుకరించాడు. ఈ క్ర‌మంలోనే ఆ వీడియో వైర‌ల్‌గా మారింది.

కాగా డ్వేన్ బ్రేవో ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడాడు. ఎన్నో విజ‌యాల‌ను అందించాడు. అయితే ఈసారి చెన్నై టీమ్ మాత్రం బ్రేవోను రిటెయిన్ చేసుకోలేదు. దీంతో అత‌ను మెగా వేలంలో త‌న పేరు న‌మోదు చేసుకుని మ‌రోమారు త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు. అయితే చెన్నై టీమ్ మ‌ళ్లీ అత‌న్ని కొనుగోలు చేస్తుందా.. లేదా వేరే ఏదైనా టీమ్ అత‌న్ని తీసుకుంటుందా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది. ఫిబ్ర‌వరి 12, 13 తేదీల్లో బెంగ‌ళూరులో ఈ ఐపీఎల్ మెగా వేలం జ‌ర‌గ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now