Viral Video : వ‌రుడు పూల‌మాల వేయ‌బోతే జిమ్నాస్టిక్స్ చేసిన‌ట్లు వ‌ధువు ఎలా వంగిందో చూడండి..!

January 25, 2022 10:04 PM

Viral Video : పెళ్లిళ్ల స‌మ‌యంలో అప్పుడ‌ప్పుడు కొన్ని వింతైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి సంఘ‌ట‌న‌ల‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అవి కాస్తా వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ వింతైన సంఘ‌ట‌న వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అందులో ఏముందంటే..

Viral Video bride bent when groom tried to put garland in her neck

పెళ్లి సందర్భంగా వేదిక‌పై నిల‌బ‌డ్డ వ‌ధూవ‌రులు దండ‌లు మార్చుకుంటున్నారు. అయితే వ‌ధువు మెడ‌లో వ‌రుడు పూల‌మాల వేయ‌బోగా.. వ‌ధువు వ‌ద్ద‌న్న‌ట్లుగా వెన‌క్కి వంగింది. ఆమె వంగిన భంగిమ‌ను చూస్తే ఆమె జిమ్నాస్టిక్స్ చేసిన‌ట్లు అనిపిస్తుంది. ఆ స‌మ‌యంలో వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆ వీడియోపై ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Parul Garg (@parulgargmakeup)

ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ వంగిన‌ట్లు వ‌ధువు ఎలా వంగిందో చూడండి.. అంటూ కొంద‌రు కామెంట్లు చేయ‌గా.. మార్ష‌ల్ ఆర్ట్స్ చ‌దివిన‌ట్లుంది, అందుక‌నే పెళ్లి స‌మ‌యంలోనే వ‌రున్ని ఆట ఆడిస్తుంది.. అంటూ మ‌రికొంద‌రు కామెంట్లు చేశారు. ఇక ఈ వీడియోను నెటిజ‌న్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now