Sreesanth : ఐపీఎల్ వేలంకు సిద్ధ‌మ‌వుతున్న శ్రీ‌శాంత్‌.. ఈసారైనా అదృష్టం వ‌రించేనా ?

January 25, 2022 9:28 PM

Sreesanth : భార‌త మాజీ ఫాస్ట్ బౌల‌ర్ ఎస్ శ్రీ‌శాంత్ ఇటీవ‌లి కాలంలో వార్త‌ల్లో ఎక్కువ‌గా నిలుస్తున్నాడు. శ్రీ‌శాంత్ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ 2022 మెగా వేలంకు గాను త‌న పేరును ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. గ‌త ఏడాది జ‌రిగిన వేలంకు కూడా శ్రీ‌శాంత్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అయితే అప్ప‌ట్లో అత‌న్ని ఏ ఫ్రాంచైజీ కూడా తీసుకోలేదు.

Sreesanth  preparing fro mega auction of IPL

ఐపీఎల్ 2021 వేలంలో శ్రీ‌శాంత్ త‌న బేస్ ధ‌ర‌ను రూ.75 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించి పేరు న‌మోదు చేసుకున్నాడు. కానీ అత‌న్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆస‌క్తిని చూపించ‌లేదు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మెగా ఐపీఎల్ వేలంలోనూ మ‌రోమారు శ్రీ‌శాంత్ త‌న పేరును న‌మోదు చేసుకుని మ‌రోమారు త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు. ఈసారి త‌న బేస్ ధ‌ర‌ను రూ.50 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించాడు.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 6వ ఎడిష‌న్‌లో మే 2013లో శ్రీ‌శాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డాడంటూ బీసీసీఐ అత‌నిపై జీవిత కాల నిషేధం విధించింది. దీంతో శ్రీ‌శాంత్ సుప్రీం కోర్టులో పోరాటం చేశాడు. ఈ క్ర‌మంలోనే అత‌నిపై ఉన్న నిషేధాన్ని 7 ఏళ్ల‌కు త‌గ్గించారు. త‌రువాత 2020 సెప్టెంబ‌ర్‌లో మ‌ళ్లీ క్రికెట్ ఆడ‌డం ప్రారంభించాడు.

కాగా శ్రీ‌శాంత్ 2021 జ‌న‌వ‌రిలో జ‌రిగిన విజ‌య్ హ‌జారే ట్రోఫీలో కేర‌ళ త‌ర‌ఫున 6 గేమ్స్‌లో ఆడి మొత్తం 13 వికెట్ల‌ను తీసి స‌త్తా చాటాడు. ఐపీఎల్‌లో శ్రీ‌శాంత్ 44 మ్యాచ్‌లు ఆడి 40 వికెట్లు తీశాడు. అప్ప‌ట్లో అత‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌, కొచ్చి ట‌స్క‌ర్స్ త‌ర‌ఫున ఆడాడు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మెగా వేలం కోసం శ్రీ‌శాంత్ సిద్ధ‌మ‌వుతున్నాడు. అయితే ఈసారైనా అత‌న్ని తీసుకునేందుకు ఏదైనా ఫ్రాంచైజీ ఆస‌క్తి చూపిస్తుందా..? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

కాగా ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొత్తం 1214 మంది ప్లేయ‌ర్ల‌కు వేలం వేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల్లో బెంగ‌ళూరులో వేలం జ‌ర‌గ‌నుంది. మొత్తం 1214 మందిలో 896 మంది భార‌త ప్లేయ‌ర్లు కాగా.. 318 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉన్నారు.

బీసీసీఐ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మొత్తం ప్లేయ‌ర్ల‌లో 270 మంది క్యాప్డ్ ప్లేయ‌ర్లు కాగా, 903 మంది అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్లు, 41 మంది అసోసియేట్ ప్లేయ‌ర్లు ఉన్నారు. 10 దేశాల నుంచి విదేశీ క్రికెట‌ర్లు వేలంలో ఉన్నారు. ఈసారి ఆస్ట్రేలియాకు చెందిన 59 మంది ప్లేయ‌ర్లు అత్య‌ధికంగా వేలంలో పాల్గొంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now