Chicken : బాబోయ్‌.. 3 రోజుల్లోనే 60 ల‌క్ష‌ల కిలోల చికెన్‌ను తిన్న హైద‌రాబాదీయులు..

January 18, 2022 4:32 PM

Chicken : సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా చాలా మంది హైద‌రాబాద్ నుంచి త‌మ సొంత ఊళ్ల‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్ర‌తి ఏటా ఇలాగే జ‌రుగుతుంటుంది. అయితే ఈసారి కూడా అలాగే చాలా మంది ఊళ్ల‌కు త‌ర‌లివెళ్లారు. అయిన‌ప్ప‌టికీ న‌గ‌రంలో ఉన్న‌వారు మాత్రం భారీగా చికెన్‌ను లాగించేశారు.

hyderabadis ate over 60 lakh kilos of Chicken during sankranthi

గ‌త శుక్ర‌వారం నుంచి ఆదివారం వ‌ర‌కు మూడు రోజుల్లోనే హైద‌రాబాద్ వాసులు ఏకంగా 60 ల‌క్ష‌ల కిలోల చికెన్‌ను తిన్నారు. సాధార‌ణంగా మ‌ట‌న్ ధ‌ర ఎక్కువ‌గా, చికెన్ ధ‌ర త‌క్కువ‌గా ఉంటుంది. క‌నుక చికెన్ తినే వారి సంఖ్యే ఎక్కువ‌గా ఉంటుంది. కిలో మ‌ట‌న్ ధ‌ర రూ.800 నుంచి కొన్ని చోట్ల రూ.900 వ‌ర‌కు ప‌లుకుతుండ‌గా.. చికెన్ ధ‌ర మాత్రం కేజీకి రూ.240 వ‌ర‌కు ప‌లికింది.

సాధార‌ణ రోజుల్లో హైద‌రాబాద్ వాసులు రోజుకు 10 ల‌క్ష‌ల కిలోల చికెన్ తింటారు. కానీ సంక్రాంతి రోజుల్లో మాత్రం ఇంత‌కు రెట్టింపు స్థాయిలో చికెన్‌ను తిన‌డం విశేషం. ఇక శుక్ర‌వారం, శ‌నివారం రెండు రోజుల్లో 30 ల‌క్ష‌ల కిలోల చికెన్ విక్ర‌యాలు జ‌ర‌గ్గా.. ఒక్క ఆదివారం రోజే ఏకంగా 30 ల‌క్ష‌ల కిలోల చికెన్ అమ్ముడైంది.

ఇక సాధార‌ణ రోజుల్లో హైద‌రాబాద్‌లో రోజుకు 2 ల‌క్ష‌ల కిలోల మ‌ట‌న్ అమ్ముడ‌వుతుంది. కానీ ఆదివారం రోజు ఏకంగా 5 ల‌క్ష‌ల కిలోల మ‌ట‌న్‌ను కొనుగోలు చేశారు. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లోనూ 15 ల‌క్ష‌ల కిలోల మేర మ‌ట‌న్‌ను విక్ర‌యించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment