News : దారుణం.. స్నేహితుల‌తో క‌లిసి భార్య‌ను సిగ‌రెట్ల‌తో కాల్చాడు.. ఆపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు..

January 17, 2022 4:22 PM

News : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి త‌న న‌లుగురు స్నేహితుల‌తో క‌లిసి త‌న భార్య (32)ను సిగ‌రెట్ల‌తో కాల్చాడు. అంత‌టితో ఆగ‌కుండా వారు ఐదుగురు క‌లిసి ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

News man tortured his wife with his friends

చ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన ఆ మ‌హిళ ఇండోర్‌కు చెందిన వ్య‌క్తిని కొంత కాలం కింద‌ట పెళ్లి చేసుకుంది. ఓ మాట్రిమోనియ‌ల్ సైట్ ద్వారా ఇద్ద‌రికీ ప‌రిచ‌యం కాగా వారు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వ్య‌క్తికి అంత‌కు ముందే వివాహం అయింద‌ని పోలీసులు తెలిపారు.

కాగా ఇండోర్‌లోని శిప్రా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న ఆ వ్య‌క్తి ఫామ్ హౌస్‌కు త‌న భార్య‌ను తీసుకెళ్లాడు. ఈ క్ర‌మంలోనే అతనికి చెందిన న‌లుగురు స్నేహితులు అక్క‌డికి వ‌చ్చారు. వారంద‌రూ క‌లిసి ఆ మ‌హిళ‌ను సిగ‌రెట్ల‌తో కాల్చారు. ఆపై ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. త‌న‌తో అస‌హ‌జ రీతిలో బ‌ల‌వంతంగా శృంగారంలో పాల్గొన్నార‌ని.. ఆ మ‌హిళ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

అయితే ఆ ఫామ్ హౌస్ నుంచి ఎలాగో త‌ప్పించుకుని బ‌యట ప‌డిన ఆమె చ‌త్తీస్ గ‌ఢ్‌లోని త‌న పుట్టింటికి వెళ్లింది. ఆమె భ‌ర్త‌కు చెందిన ఒక స్నేహితుడు ఆమెను అక్క‌డి వ‌ర‌కు ఫాలో అయ్యాడు. అయితే ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో.. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే ఆమె భ‌ర్త‌ను, అత‌ని న‌లుగురు స్నేహితుల‌ను చ‌త్తీస్‌గ‌డ్‌, ఇండోర్‌ల‌లో భిన్న ప్రాంతాల్లో పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లోని ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now