Renu Desai : టీకా రెండు డోసులు తీసుకున్నా.. అయినా క‌రోనా వ‌చ్చింది: రేణు దేశాయ్

January 11, 2022 6:29 PM

Renu Desai : దేశంలో ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న విష‌యం విదితమే. తాజాగా చాలా మంది రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు మ‌రోమారు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇక ఇప్ప‌టికే మ‌హేష్ బాబు, మంచు ల‌క్ష్మీ, స‌త్య‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, త్రిష వంటి న‌టీన‌టుల‌కు క‌రోనా సోకింది. ఈ క్ర‌మంలోనే తాజాగా న‌టి, ద‌ర్శ‌కురాలు రేణు దేశాయ్‌, ఆమె కుమారుడు అకీరా నంద‌న్‌లు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని రేణు స్వ‌యంగా వెల్ల‌డించారు.

Renu Desai  and her son akira nandan got covid positive

త‌న‌కు, త‌న కుమారుడు అకీరా నందన్‌కు కోవిడ్ సోకింద‌ని రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించారు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే ఉన్నామ‌ని, అయిన‌ప్ప‌టికీ క‌రోనా సోకింద‌న్నారు. కొన్ని రోజుల నుంచి త‌మ‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని.. ఈ క్ర‌మంలోనే టెస్టులు చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింద‌ని అన్నారు.

అయితే ప్ర‌స్తుతం తాము కోలుకుంటున్నామ‌ని.. తాను ఇప్ప‌టికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాన‌ని.. అయిన‌ప్ప‌టికీ త‌న‌కు క‌రోనా సోకింద‌ని, అకీరాకు టీకా వేయిద్దాం అనుకుంటున్నామ‌ని.. కానీ ఇంత‌లోపే కోవిడ్ బారిన ప‌డ్డాడ‌ని తెలిపారు. క‌రోనా మూడో వేవ్‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని.. మాస్కులు ధ‌రిస్తూ, భౌతిక దూరం పాటించాల‌ని రేణు దేశాయ్ సూచించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now