Viral Video : త‌ల్లికి బ‌ర్త్ డే గిఫ్ట్‌గా ఫోన్ ఇచ్చిన కొడుకు.. ఆమె రియాక్ష‌న్ చూస్తే క‌ళ్ల‌కు నీళ్లు వ‌స్తాయి..

January 8, 2022 6:27 PM

Viral Video : త‌ల్లి ప్రేమ అంటే అదే.. త‌న పిల్ల‌ల‌ను ఎంతో మురిపెంగా చూసుకుంటుంది. తాను తిన్నా, తిన‌క‌పోయినా.. పిల్ల‌ల‌కు మాత్రం పెడుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. అలాంటి త‌ల్లికి ఏదైనా బ‌హుమ‌తి ఇస్తే అప్పుడు ఆమెలో క‌నిపించే రియాక్ష‌న్ ను చూసేందుకు కోట్లు ఇచ్చినా స‌రిపోవు. అంత‌టి భావోద్వేగం ఉంటుంది. అక్క‌డ కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది.

Viral Video son given phone as a birth day gift to his mother

త‌మిళ‌నాడుకు చెందిన విఘ్నేష్ అనే వ్య‌క్తి త‌న త‌ల్లికి బ‌ర్త్ డే సంద‌ర్భంగా రూ.8,800 పెట్టి ఫోన్ కొని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప‌నిచేసుకుంటున్న ఆమె వ‌ద్ద‌కు వెళ్లి ఓ క‌వ‌ర్‌ను ఇచ్చి తెరిచి చూడ‌మ‌న్నాడు. ఆమె తెరిచి చూసి అందులో ఫోన్ క‌నిపించే సరికి ఆమె షాకైంది. వెంట‌నే కొడుకు వ‌ద్ద‌కు వ‌చ్చి ఆలింగ‌నం చేసుకుంది. త‌రువాత క‌వ‌ర్‌ను ఆప్యాయంగా హ‌త్తుకుంది.

23 సెక‌న్ల నిడివి ఉన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. చాలా మంది ఆమె రియాక్ష‌న్ చూసి భావోద్వేగానికి గుర‌వుతున్నారు. త‌ల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంద‌ని కామెంట్లు చేస్తున్నారు. ఫోన్ ఖ‌రీదు ఎంత అన్న‌ది కాదు ముఖ్యం, త‌న త‌ల్లికి ఆ కొడుకు ఇచ్చిన ఆ బ‌హుమతే చాలా పెద్దది.

ఇక ఈ వీడియోకు ఇప్ప‌టికే 6.13 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ రాగా.. 29వేల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. 5,900 కు పైగా రీట్వీట్లు వ‌చ్చాయి. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now