Aryan Khan : ఎయిర్‌పోర్టులో ప‌బ్లిగ్గా మూత్ర విసర్జ‌న చేసిన షారూఖ్ ఖాన్ త‌న‌యుడు..? నిజ‌మేనా..?

January 5, 2022 5:51 PM

Aryan Khan : బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్ కుమారుడికి గ‌తేడాది చివ‌రి నెల‌లు ఎంతో గ‌డ్డు స‌మ‌యం అని చెప్ప‌వ‌చ్చు. ముంబైలో ఓ క్రూయిజ్ షిప్ పార్టీలో డ్ర‌గ్స్ తీసుకున్నాడ‌ని, డ్ర‌గ్స్ అమ్మాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో షారూఖ్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్‌ను ఎన్‌సీబీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని వారాల అనంత‌రం అత‌నికి బాంబే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఇప్ప‌టికే ఆర్య‌న్ ఖాన్ బ‌య‌ట సరిగ్గా క‌నిపించ‌డం లేదు.

Aryan Khan at airport urination video is it true

అయితే డ్ర‌గ్స్ మ‌త్తులో ఉన్న ఆర్య‌న్ ఖాన్ ఎయిర్ పోర్టులో అంద‌రూ చూస్తుండ‌గానే ప‌బ్లిగ్గా మూత్ర విస‌ర్జ‌న చేశాడ‌ని చెబుతూ ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. అందులో ఉన్నది ఆర్య‌న్ ఖానే అని చాలా మంది న‌మ్మారు. కానీ అస‌లు ఆ వీడియోలో ఉన్నది ఆర్య‌న్ ఖాన్ కాద‌ని తేలింది. నిజానికి ఆ వీడియో ఇప్ప‌టిది కాదు.. 2012కు చెందిన‌ది.

https://twitter.com/neta_kahin/status/1477906876939399170?s=20

ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు బ్రాన్స‌న్ పెల్లెటియ‌ర్ అప్ప‌ట్లో లాస్ ఏంజ‌ల్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులో విప‌రీత‌మైన డ్ర‌గ్స్ మ‌త్తులో ఉండి ఏం చేస్తున్నాడో తెలియ‌కుండా ప్ర‌వ‌ర్తించాడు. ఎయిర్ పోర్టు లాబీలో ప‌బ్లిగ్గా మూత్ర విస‌ర్జ‌న చేశాడు. అనంత‌రం అత‌ను విమానం ఎక్క‌బోతే అత‌నికి అనుమ‌తి ల‌భించ‌లేదు. ఈ క్ర‌మంలోనే కోర్టు అత‌నికి 2 ఏళ్ల ప్రొబేష‌న్ విధించింది. ఆ వీడియోలో ఉన్న‌ది బ్రాన్స‌న్ కాగా.. అందులో ఉన్నది షారూఖ్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ అని ప్ర‌చారం చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైర‌ల్ అయింది.

అయితే ఆ వీడియోలో ఉన్నది ఆర్య‌న్ ఖాన్ కాద‌ని తేలింది. ఇక ఈ విష‌యం తెలిసిన షారూఖ్ ఫ్యాన్స్ ఆర్య‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఆర్య‌న్ ఖాన్ అస‌లు డ్ర‌గ్స్ కేసులో నిర్దోషి అని తేలింద‌ని, అందుక‌ని విడిచిపెట్టాల‌ని, ఇలాంటి త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేయ‌కండ‌ని.. అత‌ని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now