Bigg Boss 5 : బిగ్ బాస్ ఫినాలేకి షాకింగ్ టీఆర్‌పీ.. కానీ..!

December 31, 2021 9:02 PM

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లోనూ స‌క్సెస్ ఫుల్‌గా సాగుతోంది. తెలుగులో ఈ కార్య‌క్ర‌మం ఐదు సీజ‌న్స్ ను పూర్తి చేసుకుంది. మొదట జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ ప్రయాణం మొదలైన విషయం తెలిసిందే.. ఆ సీజన్ లో ఫైనల్ ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా ఎవరు కూడా రాలేదు. ఇక ఫైనల్ లో 14.13 టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకుంది.

Bigg Boss 5  got wonderful trps

బిగ్ బాస్ మొదటి సీజన్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఆ బాధ్యతను కొనసాగించలేకపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన నాచురల్ స్టార్ నాని తనదైన శైలిలో డిఫరెంట్ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. రెండవ సీజన్ కు 15.05 టీఆర్‌పీ రేటింగ్ దక్కింది. రెండో సీజన్లో కౌశల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక మూడవ సీజన్ నుంచి అక్కినేని నాగార్జున తన దైన శైలిలో హోస్టింగ్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. మొదటి అడుగులోనే ఆయన హోస్ట్ గా పర్ఫెక్ట్ అని తేలిపోయింది.

బిగ్ బాస్ మూడవ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ 18.29 టీఆర్‌పీ రేటింగ్ అందుకుంది. ఆ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. నాలుగవ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు అత్యధికంగా 19.51 టీఆర్‌పీ రేటింగ్ అందుకొని సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఫైనల్ ఎపిసోడ్ లో ప్రత్యేక ఆకర్షణ గా నిలవడం విశేషం. సీజ‌న్ 5కి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. నాలుగు గంటలకు పైగా ప్రసారమైన ఈ షోకు 18.04 టీఆర్పీ రేటింగ్ వచ్చిందని స్టార్ మా నిర్వాహకులు ప్రకటించారు. గత సీజన్‌ తో ఉన్నంతలో రేటింగ్ విషయం కాస్త తగ్గింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now