Allu Arjun : ఆఫీస్ బాయ్‌కి త‌న సినిమాలో ఛాన్స్ ఇస్తాన‌ని చెప్పిన బ‌న్నీ

December 30, 2021 9:05 AM

ఆర్య‌, ఆర్య‌ 2 చిత్రాల త‌ర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం పుష్ప‌. ఎర్ర‌చంద‌నం స్మగ్లింగ్‌ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. గత సినిమాల కంటే కూడా అత్యధిక వసూళ్లను అందుకుని మార్కెట్లో బన్నీ స్థాయిని కూడా అమాంతంగా పెంచేసింది.

Allu Arjun said he will give cinema chance to his office boy

తాజాగా చిత్ర బృందం సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు. అల్లు అర్జున్.. ‘ఆర్య నుంచి పుష్ప దాకా నా ప్రయాణంలో వెన్నంటి ఉండి నడిపించిన సుకుమార్‌ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి, అక్కడ విజయం రావడానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ ధన్య వాదాలు తెలియజేసుకుంటున్నా’’ అన్నారు.

ఇక త‌న స్టాఫ్ గురించి కూడా మాట్లాడుతూ వారు లేనిదే తాను లేన‌ని చెప్పాడు. ఫ్యామిలీతో క‌న్నా వీరితోనే ఎక్కువ స‌మ‌యం స్పెండ్‌ చేస్తాన‌ని అన్నాడు బ‌న్నీ. ఇక త‌న ఆఫీస్ బాయ్ గురించి మాట్లాడుతూ.. ఒక‌ప్పుడు అత‌ను టిక్ టాక్ స్టార్. ఎప్పుడైతే టిక్ టాక్ మూత‌ప‌డిందో అత‌ని స్టార్‌డం ప‌డిపోయింద‌ని స‌ర‌దాగా అన్నాడు. త‌ర్వాతి సినిమాలో అత‌నికి ఛాన్స్ ఇస్తాన‌ని మాట ఇచ్చాడు బ‌న్నీ. ఇక సుకుమార్ యూనిట్‌లో బాగా కష్టపడి పనిచేసిన సెట్‌బాయ్స్‌, ప్రొడక్షన్‌ బాయ్స్‌కు ఒక్కొక్కరికీ రూ.1 లక్ష బహుమానంగా ఇస్తామని ప్రకటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now