Ram Charan Tej : చ‌నిపోయే వ‌ర‌కు తార‌క్ నా మ‌న‌సులో ఉంటాడు.. చ‌ర‌ణ్ షాకింగ్ కామెంట్స్..

December 28, 2021 8:14 PM

Ram Charan Tej : రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. తాజాగా చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చరణ్ మాట్లాడుతూ” ఈవెంట్ కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియ‌జేస్తూ.. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాము.. మా గురువు అనాలా.. మా హెడ్ మాస్టర్ అనాలా, ప్రిన్సిపాల్ అనాలా.. నాకు ఇండస్ట్రీ ఫస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనాలా.. మా ఇద్దరినీ కలిపి సినిమా తీసినందుకు రాజమౌళికి థాంక్స్ అని చెప్పాడు.

Ram Charan Tej said ntr will be in his heart till his death

అనంత‌రం ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తనది సింహంలాంటి పర్సనాలిటీ.. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం. తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తారక్‌లాంటి నిజమైన బ్రదర్‌ని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్‌. తారక్‌కి థ్యాంక్స్‌ చెబితే మా బంధం ఇక్కడితో ముగిసిపోద్ది అనేది నా భావన.. నేను చనిపోయేవరకు ఆ బ్రదర్‌ హుడ్‌ని నా మనసులో పెట్టుకుంటాను’.. అంటూ చరణ్‌ ఎమోషనల్‌ స్పీచ్‌ ఇచ్చాడు.

ఆ సమయంలో స్టేజ్‌ కింద రాజమౌళి పక్కన కూర్చున్న తారక్‌.. చెర్రీ మాటలను ఆస్వాదిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. చెన్నైలో గ్రాండ్‌గా జ‌రిగిన ఈ ఈవెంట్‌కి తమిళ సినీ హీరోలు ఉదయనిధి, శివకార్తికేయన్, నిర్మాతలు థాను, ఆర్బీ చౌదరి, తమిళ లిరిక్ రైటర్ మదన్ కార్కీ తదితరులు వ‌చ్చి వారు సినిమాతోపాటు హీరోల‌పై కూడా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now