Sai Dharam Tej : సాయి ధ‌ర‌మ్‌ కు షాక్‌.. యాక్సిడెంట్ కేసులో నోటీసులు పంపిన పోలీసులు..

December 28, 2021 3:22 PM

Sai Dharam Tej : మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ అతి పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన తేజ్‌కి కంటి పైభాగంతోపాటు ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. చాలా రోజులు అపోలో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నాడు. సాయి తేజ్ కు యాక్సిడెంట్ జరగడంతో మెగా హీరోలంతా హస్పిటల్ కు పరుగులు తీశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌.. హస్పిటల్ లో ఎప్పటికప్పుడు సాయి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ తో మాట్లాడుతూ.. దగ్గరుండి చూసుకున్నారు.

police given notice to Sai Dharam Tej in accident case

ప్ర‌స్తుతం తేజ్ క్షేమంగానే ఉన్నాడ‌ని తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లో మ‌ళ్లీ సినిమాలు చేయ‌నున్నాడు. అయితే ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేశామని, అతను కోలుకున్న తర్వాత నోటీసులు కూడా ఇచ్చామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. 91 సీఆర్పీసీ కింద సాయిధరమ్‌ తేజ్‌కు నోటీసులు జారీం చేశాం. లైసెన్స్, బైక్ ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్ల వివరాలన్నీ ఇవ్వాలని నోటీసులు పంపాం. ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు.

త్వరలోనే చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని ఆయన అన్నారు. అయితే సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందని జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు పోలీసులు సాయి ధరమ్ తేజ్ పై కేసు ఎలా పెడతారని, కొత్తగా బిల్డింగ్ కడుతున్న కాంట్రాక్టర్ రోడ్డుపై ఇసుక పోయించడంతోనే సాయిధరమ్ తేజ్ నడుపుతున్న బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదం జరిగిందని అప్పట్లో చర్చలు జరిగాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now