Ram Charan Tej : త‌న తాత‌ని 15 రోజులు జైల్లో పెట్టార‌నే షాకింగ్ విష‌యం వెల్ల‌డించిన రామ్ చ‌ర‌ణ్‌..!

December 27, 2021 8:29 AM

Ram Charan Tej : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంటూ వ‌స్తున్నారు. ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఆయ‌న కొద్ది రోజులుగా ప్ర‌మోష‌న్స్‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నాడు. తాజాగా చరణ్ ఓ ఫుడ్ ఛాలెంజ్‏లో పాల్గొన్నారు. ఇందులో ఆర్ఆర్ఆర్ సినీ విశేషాలతోపాటు.. తనకు ఇష్టమైనన ఫుడ్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

Ram Charan Tej told that his grand father was in jail at that time

త‌న తాత అల్లు రామ‌లింగ‌య్య గురించి మాట్లాడుతూ.. తన తాత స్వాతంత్య్ర సమరయోధుడని చెప్పిన చెర్రీ.. ఆ రోజుల్లో ఆయన హక్కులపై పోరాటం చేశారని, ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసని తెలిపారు. ఆ పోరాటంలో ఆయన జైలు పాలయ్యారని, 15 రోజులకు పైగా ఆయన్ని జైలులో ఉంచారని తన కుటుంబ సభ్యుల్లో కూడా కొద్ది మందికి మాత్రమే తెలుసంటూ ఓపెన్ అయ్యారు.

ఇక ఫుడ్ గురించి మాట్లాడుతూ.. మా ఇంట్లో ఎక్కువగా స్పైసీ తినేది నేనే. కేవలం ఇవే కాకుండా అన్నింటినీ ఎంజాయ్ చేస్తాను… అలా అని నేను భోజన ప్రియుడిని కాదు. నాన్ వెజ్ కంటే వెజ్ ఎక్కువగా ఇష్టపడతాను.. హైదరాబాద్ బిర్యానీ ఇష్టం. కాస్త సమయం ఉన్నా అప్పుడప్పుడు వంట చేస్తాను. ఇక మా ఇంట్లో ఫేమస్ చిరు దోశ గురించి కూడా నాకేమీ తెలియదు.. అందులో ఉపయోగించే పదార్థాల గురించి అమ్మ ఎప్పుడూ చెప్పలేదని చెప్పుకొచ్చారు చరణ్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now