Vijay Devarakonda : వంద మందికి మొత్తం రూ.10 ల‌క్ష‌ల సాయం చేయ‌నున్న విజ‌య్ దేవ‌రకొండ‌..!

December 26, 2021 10:31 PM

Vijay Devarakonda : రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల‌తోనే కాకుండా సేవా కార్య‌క్ర‌మాల ద్వారానూ ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుంటున్నాడు. గ‌తంలో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన రౌడీ బాయ్ ఈ క్రిస్మస్ కి మరో 100 మందికి సహాయం చేయడానికి రెడీ అయ్యాడు. 100 మందికి రూ.10వేల చొప్పున రూ.10 లక్షల సహాయం ప్రకటించాడు. జనవరి 1న 100 మందికి ఆ డబ్బులు ఇస్తానని తెలిపాడు.

Vijay Devarakonda said he will help 100 members with total of rs 10 lakhs

పండుగ చేసుకోలేని వారు, అత్య‌వ‌స‌ర అవ‌సరం ఉన్న‌వారు మాత్ర‌మే ఈ సహాయం అందుకోవాల‌ని కోరాడు విజ‌య్. దీని కోసం ఓ ఫార్మాట్ ను కూడా ప్రకటించాడు రౌడీ హీరో. సహాయం కావాల్సిన వారు వాళ్ల మెయిల్ ఐడీ నుంచి రౌడీ క్లబ్ లో రిజిస్టర్ కావాలని సూచించాడు. అందరి పేర్లను.. వాళ్ల వివరాలను నిశితంగా పరిశీలించి 100 మందిని ఎంపిక చేస్తానని తెలిపాడు. జ‌నవరి 1వ తేదీన 100 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అందులో 50 మంది నా అభిమానులు ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి రౌడీ కోడ్ అండ్ రిజిస్టర్డ్ ఐడీని ఎంటర్ చేయండి” అని చెప్పుకొచ్చాడు.

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` చిత్రంలో నటిస్తున్నాడు. చిత్రీకరణ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా హిట్ అయితే విజయ్ రేంజ్ అంతకంతకూ పెరిగిపోతుందనడంలో సందేహం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now