Pushpa : బ‌న్నీని న‌గ్నంగా చూపించాల‌ని అనుకున్న సుకుమార్..!

December 26, 2021 7:28 PM

Pushpa : అల్లు అర్జున్ తొలిసారి ఊర‌మాస్‌లో క‌నిపించిన చిత్రం పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ న‌ట విన్యాసం అదిరిపోయింది. శ్రీవ‌ల్లిగా ర‌ష్మిక కూడా అల‌రించింది. ఈ సినిమాకు రూ.150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో రూ.102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 9 రోజుల్లో ఈ సినిమాకు రూ.123 కోట్ల షేర్ వచ్చింది. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది.

Pushpa  sukumar thought about the climax scene in movie

పుష్ప సినిమాకి సంబంధించి ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో సుకుమార్ షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించారు. క్లైమాక్స్‌లో విలన్‌ ఫహద్‌ ఫాజిల్‌, అల్లు అర్లున్‌ అర్థనగ్నంగా కనిపించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కూడా అండర్ వేర్ లో కనిపించి చాలా పోటాపోటీగా డైలాగ్స్ చెప్పారు. కానీ ప్రేక్షకులను ఆ సీన్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ క్లైమాక్స్‌ సీన్‌పై దర్శకుడు సుకుమార్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘పుష్ప క్లైమాక్స్‌లో బన్నీ, ఫహాద్‌ ఇద్దరూ ప్యాంట్‌ షర్ట్‌ విప్పేసి సవాళ్లు విసురుకుంటారు. నిజానికి ఆ సీన్‌లో ఇద్దరినీ నగ్నంగా చూపించాలనుకున్నా. కానీ, తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌ను అంగీకరించరని తెలిసి అప్పటికప్పుడు మార్పులు చేశాం’అని సుకుమార్‌ చెప్పుకొచ్చాడు. మొదటి భాగంతో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేశామని, అసలు కథ సెకండ్‌ పార్ట్‌లో ఉంటుందన్నాడు సుకుమార్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now