Exam : ప‌రీక్ష‌ల‌లో హీరోయిన్ కొడుకు గురించి ప్ర‌శ్న‌.. మండిప‌డుతున్న త‌ల్లిదండ్రులు..

December 26, 2021 6:21 PM

Exam : ప‌రీక్ష‌ల‌లో సెల‌బ్రిటీల‌కు సంబంధించి ప‌లు ప్ర‌శ్న‌లు క‌నిపించ‌డం మ‌నం చాలా సార్లు చూశాం. దీనిపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా కూడా ఆ త‌ర‌హా ప్రయోగాలు చేయ‌డం ఆప‌డం లేదు. మధ్యప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ లో సెలబ్రిటీల లైఫ్ పై ప్రశ్నలు అడగడం షాకిచ్చింది. ఓ ప్రయివేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్ధులకు పరీక్షలు జరుగుతున్నాయి. అందులో ఓ ప్రశ్నా పత్రంలో సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్ ల కుమారుడి పేరు ఏంటి ? అనే ప్రశ్న వచ్చింది. దీంతో విద్యార్ధులు, టీచర్లు షాక్ అయ్యారు.

heroine son question came in Exam parent angry

ఈ విష‌యంపై తల్లి దండ్రులు అధికారులుకు ఫిర్యాదు చేశారు. కరెంట్ ఆఫైర్స్ సెక్షన్ నుంచైనా సెలబ్రిటీల గురించి ప్రశ్నలు రావడం ఏమిటో ! అంటూ అంతా ఆశ్యర్యపోతున్నారు. స్కూల్ విద్యార్ధుల ప్రశ్నా పత్రంలో ఇలాంటి ప్రశ్న రావడం పొరపాటున జరిగిందా ? లేక కావాలనే అడిగారా ? అన్న దానికి అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది.

ఇక ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే.. కరీనా – సైఫ్ కుమారుడు తైమూర్ అలీఖాన్ పటౌడీ. తైమూర్ పెద్ద కుమారుడు కాగా.. జహంగీర్ అలీఖాన్ పటౌడీ చిన్న కుమారుడు. కరీనా -సైఫ్ అలీఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండవ కుమారుడి పేరు అప్పట్లో వివాదాస్పదమైంది. పటౌడీ వంశస్తులకి జహంగీర్ అని పేరు పెట్టడం సరికాదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now