ఏపీ ఆంబులెన్స్‌ల‌కు తెలంగాణ‌లో నో ఎంట్రీ..!

May 10, 2021 1:21 PM

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో హాస్పిటళ్ల‌లో స‌దుపాయాల‌కు తీవ్ర కొర‌త ఏర్ప‌డింది. హాస్పిట‌ళ్లు అన్నీ కోవిడ్ బాధితులతో నిండిపోతున్నాయి. బెడ్లు, ఆక్సిజ‌న్‌, మందులు, వైద్య సిబ్బందికి తీవ్ర కొర‌త ఏర్ప‌డింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స‌దుపాయాల‌కు కొర‌త ఏర్ప‌డింది. అయితే మెరుగైన చికిత్స కోసం ఏపీ నుంచి కొంద‌రు కోవిడ్ బాధితుల‌ను కుటుంబ స‌భ్యులు తెలంగాణ‌కు తీసుకువ‌స్తున్నారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి ఆంబులెన్స్‌ల‌లో వ‌స్తున్నారు. కానీ న‌గ‌రంలోనూ స‌దుపాయాల‌కు కొర‌త ఏర్ప‌డ‌డంతో ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే ఆంబులెన్స్‌ల‌ను రాష్ట్రంలోకి అనుమ‌తించ‌డం లేదు.

telangana police sending back ap ambulances

ఏపీ నుంచి ఆంబులెన్స్‌ల‌లో వ‌స్తున్న కోవిడ్ బాధితుల‌ను తెలంగాణ పోలీసులు తిప్పి పంపేస్తున్నారు. కోదాడ మండ‌లం రామాపురం క్రాస్ రోడ్డు చెక్ పోస్టు వ‌ద్ద త‌నిఖీలు చేప‌ట్టిన పోలీసులు ఏపీ నుంచి వ‌చ్చిన ఆంబులెన్స్‌ల‌ను వెన‌క్కి పంపేస్తున్నారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి వారు వెళ్తున్నారు. అయితే హైద‌రాబాద్‌లోనూ బెడ్ల‌కు కొర‌త ఏర్ప‌డింద‌ని, స‌దుపాయాలు లేవ‌ని పోలీసులు చెబుతున్నారు.

కానీ త‌మ‌కు బెడ్ దొరికే ప‌రిస్థితి ఉంద‌ని, ద‌య‌చేసి అనుమ‌తించాల‌ని కోవిడ్ బాధితుల త‌ర‌ఫు కుటుంబ స‌భ్యులు, బంధువులు వేడుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ పోలీసులు వారిని తెలంగాణ‌లోకి అనుమ‌తించ‌డం లేదు. దీంతో చేసేది లేక వారు వెను దిరుగుతున్నారు. ఇక తెలంగాణ‌లో వైద్య సిబ్బంది కొర‌త ఏర్ప‌డ‌డంతో సీఎం కేసీఆర్ 50వేల మంది ఎంబీబీఎస్ డాక్ట‌ర్ల‌ను కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 2-3 నెల‌ల కోసం నియ‌మించుకోవాల‌ని హెల్త్ ఆఫీస‌ర్ల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే ప‌రిస్థితి రోజు రోజుకీ మ‌రింత ద‌య‌నీయంగా మారుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now