Currency Notes : వామ్మో.. గుట్ట‌లు గుట్ట‌లుగా నోట్ల క‌ట్ట‌లు.. కోట్ల కొద్దీ రూపాయ‌లు.. తీసేకొద్దీ బ‌య‌ట ప‌డుతున్నాయి..!

December 24, 2021 6:08 PM

Currency Notes : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో షాకింగ్ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తికి చెందిన ప‌రిశ్ర‌మ‌లో ఐటీ, జీఎస్‌టీ అధికారులు సోదాలు నిర్వ‌హించ‌గా.. అందులో భారీ ఎత్తున డ‌బ్బు బ‌య‌ట ప‌డుతోంది. కోట్ల కొద్దీ రూపాయ‌ల‌ను అధికారులు ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు తీశారు. ఇంకా తీస్తూనే ఉన్నారు. ప్ర‌స్తుతానికి ల‌భించిన డ‌బ్బు రూ.150 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని భావిస్తున్నారు.

Currency Notes it recovered rs 150 crores from perfume manufacturer

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో పీయూష్ జైన్ అనే ఓ వ్య‌క్తి గ‌త నెల‌లో స‌మాజ్‌వాదీ అత్త‌ర్ (పెర్‌ఫ్యూమ్‌)ను లాంచ్ చేశాడు. ఈయ‌న‌కు అక్క‌డి స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్‌తో స‌త్సంబంధాలు ఉన్నాయి. అయితే జీఎస్‌టీ, ప‌న్ను ఎగ‌వేసిన కేసులో గ‌త వారం రోజుల నుంచి ఆయా శాఖ‌ల‌కు చెందిన అధికారులు పీయూష్ జైన్ ప‌రిశ్ర‌మ‌లో సోదాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గురువారం వ‌ర‌కు ఆ ప‌రిశ్ర‌మ‌లో రూ.150 కోట్ల మేర డ‌బ్బును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్ప‌టికీ అక్క‌డ సోదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున డ‌బ్బు బ‌య‌ట ప‌డుతుండడం విశేషం.

ఆ ప‌రిశ్ర‌మ‌లో నిర్వ‌హించిన సోదాల్లో నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట ప‌డుతుండ‌గా.. వాటిని అధికారులు అక్క‌డిక‌క్క‌డే మూడు కౌంటింగ్ మెషిన్‌లు పెట్టి లెక్కిస్తున్నారు. దీంతో నోట్ల క‌ట్ట‌లు గుట్ట‌లుగా పేరుకుపోతున్నాయి. ఆ డ‌బ్బును చూసి అధికారులు షాక‌వుతున్నారు. అయితే పీయూష్ జైన్‌కు సంబంధించి ప‌లు కీల‌క‌పత్రాల‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక అత‌ని సోద‌రుడు ప‌మ్మి జైన్ స‌మాజ్‌వాదీ పార్టీలో నేత‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే కాన్‌పూర్‌లో ఉన్న కేకు అగ‌ర్వాల్ అనే మ‌రో వ్యాపారి ప‌రిశ్ర‌మ‌లోనూ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. స‌ద‌రు డబ్బంతా లెక్క‌లోకి రానిద‌ని, ప‌న్ను ఎగ్గొట్టి పోగు చేసిన‌ట్లు అధికారులు ప్రాథ‌మికంగా అంచ‌నాకు వ‌చ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now