Shyam Singha Roy Review : శ్యామ్ సింగ‌రాయ్ రివ్యూ.. కొత్త‌ద‌నంతో ఆకట్టుకున్న నాని..

December 24, 2021 9:07 AM

Shyam Singha Roy Review : నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ . వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాను 1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని తెరకెక్కించారు. దేవదాసీ పాత్రలో సాయిపల్లవి నటించగా, టైటిల్ రోల్ ను నాని పోషించాడు. నేడు (డిసెంబర్ 24)న ఈ మూవీ విడుదలైంది. 1940 బ్యాక్ డ్రాప్ తో రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. క‌థ‌ కొత్తగా ఉండడంతో మూవీ లవర్స్ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Shyam Singha Roy Review nani attracted with new type of film

ఈ చిత్రంలో నాని రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒకటి శ్యామ్ సింగ రాయ్ పాత్ర కాగా మరొకటి మోడ్రన్ యువకుడు వాసు. నాని వాసు రోల్ కి జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించింది. సాయి పల్లవి వాయిస్ ఓవర్ తో చిత్రం ప్రారంభం అవుతుంది. నాని వాసు పాత్రలో దర్శకుడు కావాలనే కోరికతో కనిపిస్తుంటాడు. కృతి శెట్టిని తన షార్ట్ ఫిలింలో నటింపజేసే ప్రయత్నం చేస్తుంటాడు. అలా నాని, కృతి శెట్టి మధ్య ప్రేమ సన్నివేశాలు ప్రారంభం అవుతాయి.

వాసు తెరకెక్కించిన చిత్రం వివాదంగా మారి అతడు అరెస్ట్ అవుతాడు. అత‌ను ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనేది ఇక్క‌డ పెద్ద ట్విస్ట్‌. వాసు కెరీర్ ని శ్యామ్ సింగ రాయ్ పాత్రలో దర్శకుడు ముడిపెట్టిన విధానం ఆసక్తికరంగా ఉంది. సెకండ్ హాఫ్ లో నాని శ్యామ్ పాత్రలో సోషల్ యాక్టివిస్ట్ గా కనిపిస్తాడు. బడుగు, బలహీన వర్గాల కోసం శ్యామ్ సింగ రాయ్ పోరాటం చేస్తుంటాడు. ఆ స‌మ‌యంలో నానికి సాయి పల్లవి మైత్రేయి పాత్రలో పరిచయం అవుతుంది. ఆమె దేవదాసీగా గుడిలో ఉంటుంది.

శ్యామ్ ఆమె ప్రేమలో పడతాడు. గుడి నుంచి బయటకు వచ్చేయాలని అడుగుతాడు. అందుకు సాయి పల్లవి అంగీకరించదు. సిరివెన్నెల రచించిన ‘ప్రణవలయ’ సాంగ్ లో సాయి పల్లవి విశ్వరూపమే చూపించింది. ఇక ఊహించని మలుపులతో క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. శ్యామ్, మైత్రేయి మధ్య ఏం జరిగింది.. వాసు తన సినిమా వివాదం నుంచి ఎలా బయట పడ్డాడు అనేది మిగిలిన కథ.

రాహుల్ డైరెక్ష‌న్, వాసు, శ్యామ్ పాత్రల్లో నాని ప్రదర్శించిన వేరియేషన్స్ సూపర్బ్ అనే చెప్పాలి. సాయి పల్లవి, కృతి శెట్టి ఇద్దరి రోల్స్ చాలా బాగున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాలో లీనం అయ్యేలా చేస్తుంది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని మెప్పించే చిత్రంగా రూపొందిందనే చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now