Pushpa : పుష్ప మూవీలో అల్లు అర్జున్ కు త‌ల్లిగా న‌టించిన ఈమె ఎవ‌రో తెలుసా..?

December 23, 2021 11:51 AM

Pushpa : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం పుష్ప‌. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. క‌రోనా రెండో వేవ్ త‌రువాత విడుద‌ల చిత్రాల్లో స‌క్సెస్ సాధించిన చిత్రాలు కొన్నే ఉన్నాయి. అలాంటి వాటిలో పుష్ప ఒక‌టి. పుష్ప మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో చిత్ర యూనిట్ స‌క్సెస్ మీట్‌లు నిర్వ‌హిస్తూ వ‌స్తోంది.

అయితే ఈ సినిమాలో న‌టించిన వారు అంద‌రూ దాదాపుగా ప్రేక్ష‌కుల‌కు తెలుసు. కానీ అల్లు అర్జున్‌కు త‌ల్లిపాత్ర‌లో న‌టించిన న‌టి మాత్రం చాలా మంది తెలియ‌దు. నిజానికి ఆమెను ఈ సినిమాకు గాను సుకుమార్ ఆడిష‌న్ చేసి మ‌రీ తీసుకున్నారు. ఇంత‌కీ అస‌లు ఆమె ఎవ‌రంటే..

Pushpa movie do you know about the actress who acted as allu arjun mother

పుష్ప మూవీలో అల్లు అర్జున్‌కు త‌ల్లిగా న‌టించిన ఆమె పేరు.. క‌ల్ప‌ల‌త‌. ఈమె ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో న‌టించింది. కానీ పుష్ప‌తో ఈమెకు బాగా గుర్తింపు ల‌భించింది. దీంతో ఇప్పుడు ఈమె గురించి అంద‌రూ వెద‌క‌డం మొద‌లు పెట్టారు.

ఇక చిత్రంలో న‌టించేందుకు గాను 6 నెల‌ల ముందే త‌న‌కు ఆడిష‌న్ నిర్వ‌హించార‌ని.. 6 నెల‌ల త‌రువాత చిత్రంలో అల్లు అర్జున్ కు త‌ల్లిగా న‌టించే అవ‌కాశం ల‌భించింద‌ని ఫోన్ చేసి చెప్పార‌ని తెలిపింది. ఆ స‌మ‌యంలో తాను ఎంతో ఆనందంగా ఫీల‌య్యాన‌ని వివ‌రించింది. త‌న‌కు ఈ పాత్ర ఇచ్చినందుకు సుకుమార్‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now