Samantha : సమంత ఊ… కొట్టిన పాటకి ఎంత ఖర్చయ్యిందో తెలిస్తే ఉలిక్కిప‌డాల్సిందే..!

December 17, 2021 11:18 AM

Samantha : సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రిలీజ్ కి ముస్తాబైన మూవీ పుష్ప. ఈ నెల 17న 5 భాషల్లో విడుదల కాబోతుంది. అల్లు అర్జున్, రష్మిక నటిస్తున్న ఈ సినిమా లో సునీల్, అనసూయ, ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అందించిన పాటలు ఇప్పటికే కుర్రకారులో హుషారు తెప్పిస్తున్నాయి.

do you know know how much Samantha song in pushpa movie cost

సుకుమార్ సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ కంపొజిషన్ లో ఆ పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి కూడా. ఆ అంటే అమలాపురం, రింగ రింగా, డియ్యాలో డియ్యాలో, లండన్ బాబు, జిగేల్ రాణి లాంటి పాటలు ఆ కోవ లోకే వస్తాయి. పుష్ప సినిమాకి కూడా ఒక ఐటమ్‌ సాంగ్ ని రెడీ చేశారు సుకుమార్. “ఊ అంటావా మావ , ఊహు అంటావా మావ ” అని సాగే పాటలో స్టార్ హీరోయిన్ సమంత ఆడి పాడింది. ఆ పాట విడుదల అయినప్పటినుండి ఫుల్ ట్రెండింగ్ లో ఉంటూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నది.

యూట్యూబ్ లో విడుదలై 34 మిలియన్స్ కి పైగా వ్యూస్ సంపాదించింది. ఈ పాటకి సమంత లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ పాటకి సంబంధించిన మరో విషయం హల్‌చల్ చేస్తుంది. అదే ఈ పాటకి అయిన ఖర్చు గురించి. సెట్ వేసి, ఒక వారంలోనే అంతా పూర్తి చేసిన ఈ పాటకి 5 కోట్ల వరకు ఖర్చు అయ్యిందంట ప్రొడ్యూసర్స్ కి.

సమంత ఫస్ట్ టైం ఐటమ్‌ సాంగ్ లో ఆడి పాడినందుకు కోటి రూపాయలు తీసుకుందని సమాచారం. మొత్తానికి ఈ పాట కోసం ఒక చిన్న సినిమా బడ్జెట్ అంత ఖర్చుపెట్టారు. ఇక స్క్రీన్ మీద ఈ ఖరీదైన పాట ఎలా ఉంటుందో చూడాలంటే 17 వరకు ఆగాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment